Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Wednesday, August 14, 2024

Why are there so many colors in car number plates? Do you know what these colors mean?


 కార్ నెంబర్ ప్లేట్స్ లో ఇన్ని రంగులు ఎందుకు ఉంటాయి? ఈ రంగులకు అర్ధం ఏమిటో తెలుసా?

చాలామంది వివిధ రకాల వాహనాలకు వివిధ రంగుల నంబర్ ప్లేట్‌లను ఎప్పుడో ఒకప్పుడు.. ఎక్కడో ఓచోట.. చూసే ఉంటారు. అయితే, ఈ రంగులకు అర్ధం ఏమిటి? నెంబర్ ప్లేట్స్ కి తెలుపు కాకుండా ఇన్ని రంగులు ఎందుకు ఉంటాయి? అని ఎప్పుడైనా మీకు డౌట్ వచ్చిందా? వాహన రకాన్ని బట్టి వివిధ రకాల నంబర్ ప్లేట్స్, వాటికి ప్రత్యేక అర్ధాలు ఉంటాయి. వీటి గురించి మనం ఈ ఆర్టికల్ లో డీటెయిల్డ్ గా తెలుసుకుందాం.

వాహన రిజిస్ట్రేషన్ ప్లేట్ లేదా నంబర్ ప్లేట్ సంబంధిత రాష్ట్రంలోని ప్రాంతీయ రవాణా కార్యాలయం (RTO) ద్వారా అందచేయ బడుతుంది. వాహనం యొక్క ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ ఈ నెంబర్ ప్లేట్ కనిపించే విధంగా పెట్టుకోవాలని రూల్ కూడా ఉంది. నార్మల్ గా అందరికీ వైట్ ప్లేట్ పై బ్లాక్ లెటర్స్ తో ఈ నెంబర్ ప్లేట్ ఉంటుంది. కానీ అది కాకుండా ఇతర రంగులు కూడా ఉన్నాయి. భారతదేశంలో, మీరు 8 రకాల నంబర్ ప్లేట్లను చూడొచ్చు. అవేంటంటే… తెలుపు, నలుపు, పసుపు, ఆకుపచ్చ, రెడ్, బ్లూ, పైకి సూచించే బాణంతో నంబర్ ప్లేట్, భారతదేశ చిహ్నంతో ఎరుపు నంబర్ ప్లేట్. ఇలా ఈ ఎనిమిది ప్లేట్స్ కు అర్ధాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

తెలుపు నంబర్ ప్లేట్- సాధారణ పౌరులు తెలుపు నంబర్ ప్లేట్‌లను ఉపయోగించవచ్చు.

గ్రీన్ నంబర్ ప్లేట్- ఎలక్ట్రిక్ వాహన యజమానులు గ్రీన్ కలర్ లైసెన్స్ ప్లేట్‌తో డ్రైవ్ చేయోచ్చు.

బ్లాక్ నంబర్ ప్లేట్- అద్దె కారు డ్రైవర్లు నార్మల్ గా పసుపు అక్షరాలతో బ్లాక్ కలర్ నంబర్ ప్లేట్‌లతో వాహనాలను నడుపుతారు.

పసుపు నంబర్ ప్లేట్- పసుపు రంగు నంబర్ ప్లేట్‌తో వాహనాలని నడపడానికి వాణిజ్య డ్రైవర్లకు అధికారం ఉంది.

రెడ్ నంబర్ ప్లేట్- కొత్త కార్లలో వైట్ ఆల్ఫా అంకెలు ఉన్న రెడ్ కలర్ నంబర్ ప్లేట్ ఉపయోగించబడుతుంది. అలాగే సాధారణంగా వాహన తయారీదారు లేదా డీలర్ వద్ద ఉంటుంది.

బ్లూ నంబర్ ప్లేట్- విదేశీ ప్రతినిధులు లేదా రాయబారులు వైట్ ఆల్ఫా అంకెలతో కూడిన బ్లూ కలర్ నంబర్ ప్లేట్‌ను ఉపయోగించవచ్చు.

పైకి సూచించే బాణంతో నంబర్ ప్లేట్- మిలిటరీ అధికారులకి వాహనాలని నడపడానికి అనుమతి ఉంది. ఈ నంబర్ ప్లేట్ పైకి సూచించే బాణంతో ఉండటం జరుగుతుంది.

‘ఎంబ్లమ్ ఆఫ్ ఇండియా’ తో రెడ్ నంబర్ ప్లేట్- భారత రాష్ట్రపతి లేదా సంబంధిత రాష్ట్రాల గవర్నర్స్ ‘ఎంబ్లమ్ ఆఫ్ ఇండియా’తో రెడ్ కలర్ లైసెన్స్‌ను ఉపయోగించవచ్చు.

Thanks for reading Why are there so many colors in car number plates? Do you know what these colors mean?

No comments:

Post a Comment