Bank Cheque: బ్యాంకు చెక్కు వెనుక సంతకం ఎందుకు చేస్తారో తెలుసా? ఈ రూల్ గురించి తెలుసుకోండి.
Bank Cheque: ప్రస్తుతం బ్యాంకు నుంచి డబ్బులు తీసుకోవడానికి, ఎవరికైనా ఇవ్వడానికి చాలా మార్గాలు అందుబాటులో ఉన్నాయి. కొత్తగా ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి.
కానీ చాలా కాలం నుంచి మనీ ట్రాన్సాక్షన్స్ కోసం చెక్కులు ఉపయోగిస్తున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో చెక్ (Cheque) వెనుక సంతకం చేయడం చూసే ఉంటారు. ఇలా ఎందుకు చేస్తారు? ఎలాంటి వాటికి ఈ రూల్ వర్తిస్తుంది..? వివరాలు చూద్దాం.
మీ వద్ద బేరర్ చెక్ ఉంటే, దాని వెనుకవైపు సంతకం చేయాలి. బేరర్ చెక్ ఉన్న ఎవరైనా, చెక్కు వారి పేరు మీద రాయకపోయినప్పటికీ, బ్యాంక్ నుంచి డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. దీని వల్ల చెక్కును మరొకరు దొంగిలించే అవకాశం ఉంటుంది. ఎక్కడైనా పొరపాటున పోగొట్టుకున్నా సమస్యలు ఎదుర్కోక తప్పదు. ఈ సమస్యలకు చెక్ పెట్టడానికి బేరర్ చెక్కును తీసుకొచ్చే వ్యక్తిని, దాని వెనుక సంతకం చేయమని బ్యాంకులు కోరుతున్నాయి.
ఈ చెక్ వెనుక రిసీవర్ సంతకం ఉంటే, దీని ద్వారా డబ్బు ఎవరికి అందిందనే రికార్డు బ్యాంకు వద్ద ఉంటుంది. చెక్ ఉపయోగించి తప్పుడు వ్యక్తి క్యాష్ డ్రా చేస్తే, వారు ప్రొసీజర్ ఫాలో అయ్యారని బ్యాంక్ రుజువు చేయగలదు. దీనికి బాధ్యత చెక్ వెనుక సంతకం చేసిన వ్యక్తిపై ఉంటుంది.
బేరర్ చెక్ (Bearer Cheque) అంటే ఏంటి?
బేరర్ చెక్ అంటే బ్యాంకు వద్ద సమర్పించిన ఎవరైనా డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. చెక్కుపై ఒకరి పేరు ఉన్నప్పటికీ, డబ్బును పొందడానికి మరొక వ్యక్తి దాన్ని ఉపయోగించవచ్చు. దీని కారణంగా, చెక్కును డబ్బుగా మార్చే వ్యక్తి సంతకాన్ని తీసుకోవడం ద్వారా మోసం జరగకుండా బ్యాంకు అదనపు జాగ్రత్తలు తీసుకుంటుంది. కొన్నిసార్లు, ప్రత్యేకించి పెద్ద మొత్తంలో డబ్బు డ్రా చేస్తుంటే, చెక్కును తీసుకువచ్చే వ్యక్తి నుంచి బ్యాంక్ అడ్రస్ ప్రూఫ్ కూడా అడగవచ్చు. తర్వాత ఏదైనా మోసం జరిగితే ఆ వ్యక్తిని ట్రాక్ చేయడానికి ఇది బ్యాంక్‌కి సహాయపడుతుంది.
ఆర్డర్ చెక్ (Order Cheque) అంటే ఏంటి?
ఆర్డర్ చెక్ విషయంలో, చెక్ వెనుక సంతకం అవసరం లేదు. ఆర్డర్ చెక్‌లో, దానిపై పేరు రాసిన వ్యక్తికి మాత్రమే బ్యాంక్ సిబ్బంది డబ్బు చెల్లిస్తారు. ఈ చెక్కుపై ఇది ఆర్డర్ చెక్ అని, బేరర్ చెక్కు కాదని కూడా రాసి ఉంటుంది. చెక్కులో పేరు ఉన్న వ్యక్తి డబ్బును విత్‌డ్రా చేసుకోవడానికి తప్పనిసరిగా బ్యాంకు వద్ద ఉండాలి. దీని కారణంగా, బ్యాంకుకు వెనుకవైపున వ్యక్తి సంతకం అవసరం లేదు. ఎందుకంటే వారికి డబ్బు పొందుతున్న వ్యక్తి ఐడెంటిటీ తెలుసు.
అయితే ఆర్డర్ చెక్కుపై డబ్బులు ఇచ్చే ముందు బ్యాంకు ఉద్యోగులే స్వయంగా క్షుణ్ణంగా విచారణ చేసి సంతృప్తి చెందిన తర్వాతే డబ్బులు ఇస్తారు. చెక్కుపై ఉన్న పేరు దాన్ని తీసుకువచ్చిన వ్యక్తి ఒకరేనా? కాదా? అనేది తెలుసుకునేందుకు బ్యాంక్ ఇప్పటికీ జాగ్రత్తగా చెక్ చేస్తుంది.
Thanks for reading Bank cheque: Do you know why you sign the back of a bank cheque? Know about this rule.
No comments:
Post a Comment