Reliance Scholarship: రిలయన్స్ ఫౌండేషన్ యూజీ స్కాలర్‌షిప్
ప్రముఖ ప్రైవేటు పారిశ్రామిక సంస్థ- రిలయన్స్ ఫౌండేషన్ ఏటా పేద ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉపకారవేతనాలను అందిస్తోంది. 2024-25 విద్యా సంవత్సరానికి గాను స్కాలర్‌షిప్ పథకానికి సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తం 5 వేల మంది విద్యార్థులకు ఉపకార వేతనం అందించనున్నారు. డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు దరఖాస్తుకు అర్హులు.
స్కాలర్‌షిప్ వివరాలు...
* రిలయన్స్ ఫౌండేషన్ యూజీ స్కాలర్‌షిప్ 2024- 25
అర్హతలు: కనీసం 60 శాతం మార్కులతో 12వ తరగతి/ ఇంటర్‌మీడియట్ ఉత్తీర్ణత. 2024-25 విద్యా సంవత్సరం ఏదైనా స్ట్రీమ్‌లో రెగ్యులర్ ఫుల్-టైమ్ డిగ్రీ కోర్సు మొదటి సంవత్సరం చదువుతూ ఉండాలి. కుటుంబ వార్షికాదాయం రూ.15 లక్షలకు మించకూడదు.
అందే స్కాలర్‌షిప్: ఎంపికైన డిగ్రీ చదువుకునే విద్యార్థులకు మొత్తం రూ.2 లక్షల ఉపకారవేతనాన్ని అందిస్తారు.
ఎంపిక విధానం: ఆప్టిట్యూడ్ టెస్ట్ స్కోర్, గతంలో విద్యార్థులు చూపిన అకడమిక్ ప్రతిభ, వ్యక్తిగత సమాచారం ఆధారంగా ఎంపిక ఉంటుంది.
ఆన్‌లైన్ దరఖాస్తుకు గడువు: దరఖాస్తుల స్వీకరణకు అక్టోబర్ 6 చివరితేదీ.
ముఖ్యాంశాలు:
* రిలయన్స్ ఫౌండేషన్ యూపీ స్కాలర్‌షిప్ పథకానికి సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది.
* డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు దరఖాస్తుకు అర్హులు.
Thanks for reading Reliance scholarship: Reliance Foundation UG Scholarship
No comments:
Post a Comment