Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Thursday, October 17, 2024

Lizard: If you grow plants like this in your house, the lizards will escape..!


 Lizard: మీ ఇంట్లో ఇలాంటి మొక్కలు పెంచితే చాలు.. దెబ్బకి బల్లులు పరార్..!

వేసవి ప్రారంభం నుంచి వర్షాకాలం ముగిసే వరకు ఇళ్లలో బల్లులు ఎక్కువగా కనిపించి భయపెడుతుంటాయి. ముఖ్యంగా వర్షాకాలంలో గోడపై నుంచి కిందకు దిగి నేలపై కదులుతాయి. మీరు కూడా ఈ సమస్యతో బాధపడుతున్నారా అయితే.. బల్లులను చాలా వరకు తరిమికొట్టేందుకు ఈ మొక్కలను ఇంట్లో పెంచుకోండి. బల్లులను వదిలించుకోవడానికి ఇలాంటి ఇంటి చికిత్సలు అద్భుత ఫలితాలనిస్తాయి. కొన్ని మొక్కలు మనకు మంచి వాసనతో కూడిన రసాయనాలను విడుదల చేస్తాయి. అలాంటి మొక్కలు బల్లులు, కొన్ని రకాల కీటకాలను తరిమికొట్టడానికి ప్రమాదకరమైనవిగా పనిచేస్తాయి. ఇలాంటి మొక్కలు, వాటి వాసన ఉన్న చోట బల్లులు ఉండలేవు. దాంతో ఇంట్లోకి వచ్చిన బల్లి ఎక్కువసేపు ఉండకుండా పారిపోతుంటాయి.

ఇంటి ఆవరణలో వేప చెట్టు నాటితే ఇంట్లోకి బల్లులు రాకుండా చాలా వరకు తగ్గుతుంది. ఎందుకంటే ఇందులో యాంటీ బాక్టీరియ, యాంటీ ఫంగల్ లక్షణాలు కలిగి ఉంటాయి. దీని ఘాటైన వాసన బల్లులు ఇంట్లోకి రాకుండా చేస్తుంది.

రెండవ మొక్క తులసి. ప్రజలు తమ ఇంటి ఆవరణ మధ్యలో ఈ మొక్కను నాటవచ్చు. దీని ప్రయోజనం ఏమిటంటే.. ఈ మొక్కలో మిథైల్ సిన్నమేట్, లినోలెయిక్, కర్పూరం వంటి లక్షణాలు ఉన్నాయి. వీటి వాసన బల్లులను తరిమికొడుతుంది.

బంతి పువ్వు ఎంత అందంగా ఉంటుందో.. దాని ప్రయోజనాలు కూడా అద్భుతంగా ఉంటాయి. బల్లిని భయపెట్టేందుకు బంతి పువ్వు మొక్క కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. బంతి పువ్వులలో పైరెత్రిన్, ట్రాపెజియం అనే క్రిమిసంహారకాలు ఉంటాయి. బంతిపూలు, ఆ మొక్క నుంచి వచ్చే వాసన బల్లిని అనారోగ్యానికి గురి చేస్తాయి. కాబట్టి ఈ మొక్క ఉన్న పరిసరాల్లో ఎక్కడా బల్లులు కనిపించవు.

బల్లులను తిప్పికొట్టే మూడవ మొక్క లావెండర్. దాని బలమైన వాసన కారణంగా దీనిని తరచుగా పెర్ఫ్యూమరీలో ఉపయోగిస్తారు. దాని వాసన బల్లిని ఇంట్లోకి రానివ్వదు.

బల్లులను తరిమికొట్టడంలో పుదీనా మొక్క కూడా ప్రభావవంతంగా ఉంటుంది. ఎందుకంటే పుదీనాలో మెంథాల్ అనే రసాయనం ఉంటుంది. ఈ రసాయనం కారణంగా వచ్చే వాసన.. బల్లులను బయటకు తరిమికొట్టేలా పనిచేస్తుంది.

బల్లులను నివారించడానికి ఇంట్లో పెంచుకోగల ఉత్తమ మొక్క లెమన్‌గ్రాస్. లెమన్‌గ్రాస్‌లో ఉండే అనేక రసాయనాలలో ఒకటైన సిట్రోన్‌సెల్లా, బల్లులు, దోమలు, ఇతర కీటకాలను తిప్పికొట్టడానికి సహాయపడే ప్రత్యేకమైన సువాసనను కలిగి ఉంటుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఈ వెబ్సైట్ బాధ్యత వహించదు.)

Thanks for reading Lizard: If you grow plants like this in your house, the lizards will escape..!

No comments:

Post a Comment