ITBP Constable: ఐటీబీపీలో 545 కానిస్టేబుల్ (డ్రైవర్) పోస్టులు
భారత హోం మంత్రిత్వ శాఖకు చెందిన ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ)... కానిస్టేబుల్ (డ్రైవర్) పోస్టుల భర్తీకి నియామక ప్రకటనను విడుదలచేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 545 ఖాళీలను భర్తీ చేయనుంది. ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా ఐటీబీపీ ఎంపిక ప్రక్రియ చేపట్టనుంది. అర్హులైన అభ్యర్థులు నవంబర్ 6వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఖాళీల వివరాలు:
* కానిస్టేబుల్ (డ్రైవర్) గ్రూప్ 'సి' నాన్-గెజిటెడ్ (నాన్ మినిస్టీరియల్): 545 పోస్టులు (యూఆర్- 209, ఎస్సీ- 77, ఎస్టీ- 40, ఓబీసీ- 164, ఈడబ్ల్యూఎస్- 55)
అర్హతలు: గుర్తింపు పొందిన బోర్డు లేదా సంస్థ నుంచి మెట్రిక్యులేషన్ లేదా పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
వయోపరిమితి: 21 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు సడలింపు ఉంటుంది.
పే స్కేల్: నెలకు రూ.21,700-రూ.69,100.
ఎంపిక ప్రక్రియ: ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (పీఈటీ), ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (పీఎస్‌టీ), రాత పరీక్ష, ఒరిజినల్ డాక్యుమెంట్ల వెరిఫికేషన్, ప్రాక్టికల్ స్కిల్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పరీక్ష రుసుము: యూఆర్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ రూ.100. ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
ముఖ్య తేదీలు...
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 08-10-2024.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 06-11-2024.
ITBP Constable (Driver) Posts Recruitment Notification
Thanks for reading ITBP Recruitment 2024, Vacancy 545 Out, Read Notification, Eligibility Salary & Age
No comments:
Post a Comment