Mega DSC Notification: 16,347 టీచర్ పోస్టులతో మెగా డీఎస్సీ
నోటిఫికేషన్ విడుదల తేదీ వచ్చేసింది
నవంబర్ 2న టెట్ ఫలితాలు
ఏపీలో మెగా డీఎస్సీ-2024 నోటిఫికేషన్‌ను నవంబరు 3న జారీచేయాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ప్రాథమిక సమాచారం ప్రకారం... ఈ డీఎస్సీ ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీచేయనున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ‘టెట్’ ఫలితాలను నవంబరు 2న ప్రకటిస్తారు. ‘వందరోజుల పరిపాలన’లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను అమలుచేసే చర్యలు మొదలయ్యాయి. కేజీ నుంచి పీజీ వరకు కరిక్యులమ్‌లో మార్పులపై సమీక్షిస్తున్నారు. ఇందులో సెకండరీ గ్రేడ్ టీచర్లు (SGT) 6,371, స్కూల్ అసిస్టెంట్లు (SA)- 7,725, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (TGT)-1,781, పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్స్ (PGT)-286, ప్రిన్సిపాళ్లు 52, వ్యాయామ ఉపాధ్యాయులు (PET)-132 పోస్టులు భర్తీ చేయనున్నారు.
టెట్ ప్రిలిమినరీ కీ విడుదల
అక్టోబర్ 3 నుంచి 14వ తేదీ వరకు నిర్వహించిన ఏపీ టెట్ జులై-2024 పరీక్షల ప్రశ్నపత్రాలు, ప్రిలిమినరీ ‘కీ’లను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. పేపర్ 1ఎ, 1బి పరీక్ష ప్రిలిమినరీ ‘కీ’లపై అభ్యంతరాలను అక్టోబర్ 18వ తేదీలోగా ఆన్‌లైన్‌లో తెలియజేయాలి. మిగిలిన పరీక్షల ప్రశ్నపత్రాలు, ‘కీ’లు పరీక్ష జరిగిన తర్వాతి రోజుల్లో విడుదల కానున్నాయి. ఆన్‌లైన్‌లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) పద్ధతిలో నిర్వహించే ఈ పరీక్షలు 21వ తేదీ వరకు జరుగనున్నాయి. అక్టోబర్ 27న తుది ‘కీ’ విడుదల; నవంబర్ 2న ఫలితాల ప్రకటన ఉంటుంది.
మెగా డీఎస్సీ ఉచిత కోచింగ్
డీఎస్సీ పరీక్షకు సన్నద్ధమయ్యే విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇచ్చేందుకు సాంఘిక సంక్షేమ/ గిరిజన సంక్షేమ శాఖలు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నాయి. ఈ శిక్షణకు ఎంపికైన అభ్యర్థులకు ఉచిత బోధన, ఉచిత భోజనం, వసతి సౌకర్యాలను ప్రభుత్వం కల్పించనుంది. అనుభవజ్ఞులైన బోధనా సిబ్బందితో ఆయా జిల్లాల్లో మూడు నెలల పాటు తరగతులు నిర్వహించనున్నారు. ఎస్‌జీటీ, స్కూల్ అసిస్టెంట్ పరీక్షలకు సంబంధించి కోచింగ్ ఉంటుంది. అర్హులైన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు జ్ఞానభూమి వెబ్‌పోర్టల్ ద్వారా అక్టోబర్ 21వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
మెగా డీఎస్సీ ఉచిత కోచింగ్ పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
Thanks for reading Mega DSC Notification: 16,347 టీచర్ పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల తేదీ వచ్చేసింది
No comments:
Post a Comment