AP SCERT: ఎస్‌సీఈఆర్టీలో టీచింగ్ పోస్టులకు ప్రకటన
అక్టోబర్ 25 దరఖాస్తుకు గడువు

అమరావతి: రాష్ట్ర విద్య పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్టీ)లో డిప్యుటేషన్‌పై పని చేసేందుకు బోధన సిబ్బంది నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ బుధవారం పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు నోటిఫికేషన్ విడుదల చేశారు. ప్రొఫెసర్లు 9, లెక్చరర్లు 20తోపాటు కోఆర్డినేటర్లు ఐదు పోస్టులకు దరఖాస్తులను ఈనెల 25లోపు సమర్పించాలని సూచించారు. ఆసక్తి ఉన్నవారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. రాష్ట్రవ్యాప్తంగా వచ్చినవాటిని 28వ తేదీ నుంచి 30 వరకు పరిశీలిస్తారు. నవంబరు 4, 5వ తేదీల్లో సిబ్బందికి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఈ ఏడాది సెప్టెంబరు 28నాటికి 15 ఏళ్ల బోధన అనుభవం ఉండాలి. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందుకున్నవారికి, ఎంఫిల్, పీహెచ్‌డీ వారికి ప్రాధాన్యమిస్తారు.
Thanks for reading Applications called for deputation of teaching faculty in SCERT
No comments:
Post a Comment