Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Wednesday, October 16, 2024

Personality Test: మీ పాదాల వంపు మీ వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పేస్తుందట.. ఓసారి చెక్ చేసుకోండి..!


 Personality Test: మీ పాదాల వంపు మీ వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పేస్తుందట.. ఓసారి చెక్ చేసుకోండి..!

ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వాటిలో పర్సనాలిటి టెస్ట్ ముఖ్యమైనది. శరీర ఆకృతి, చేతి వేళ్ల పొడవు, పడుకునే భంగిమ, నడిచే తీరు.. ఇలా శరీరంలో ప్రతి భాగం మనిషి వ్యక్తిత్వం ఎలాంటిదో తెలియజేస్తుందట.

అలాంటి వాటిలోదే పాదాల వంపు కూడా. పాదాల కింది భాగం కొందరికి చదునుగా ఉంటుంది. మరికొందరికి మాత్రం వంపు తిరిగి ఉంటుంది. విల్లు లాగా వంపు తిరిగిన పాదాలు.. చదునుగా ఉన్న పాదాలు అని రెండు రకాలుగా ఉంటాయి. పాదాలు ఏ ఆకారంలో ఉంటే వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది? తెలుసుకుంటే..

వ్యక్తిత్వ విశ్లేషణలో శరీరంలో ఎన్నో అవయవాలు, వాటి ఆకారం, వ్యక్తి ఆ అవయవాలతో స్పందించే తీరును బట్టి ఆ వ్యక్తి వ్యక్తిత్వం ఎలాంటిదో చెబుతారు. ముఖ్యంగా పాదాల విషయానికి వస్తే.. గ్రీక్ ఫుట్ ఆకారం, స్క్వేర్ ఫుట్ ఆకారం, రోమన్ ఫుట్ ఆకారం, ఈజిప్టియన్ ఫుట్ ఆకారం వంటి ఆకారాలు ఉంటాయి. ఈ ఆకారాలు వ్యక్తి బలాలు, బలహీనతలు, మనస్తత్వం, వ్యక్తి ప్రవర్తనా ధోరణి వంటివి వెల్లడిస్తాయి.

చదునుగా ఉన్న పాదం..

పాదాలు చదునుగా ఉన్నవారు సాధారణంగా ఓపెన్ గా ఉంటారట. ఈ రకమైన పాదాలు ఉన్న వారు వాస్తవికతను ఎక్కువగా పరిగణలోకి తీసుకుంటారు. నలుగురిలో కలవడాన్ని, నలుగురితో మాట్లాడటం పట్ల ఆసక్తిగా ఉంటారు. స్నేహితులు, సహోద్యోగులు, బంధువులు.. ఇలా వీరికి పరిచయాల సర్కిల్ పెద్దగా ఉంటుంది. నచ్చిన వ్యక్తుల దగ్గర మరింత సంతోషంగా ఉంటారు. చదునైన పాదాలు ఉన్న వ్యక్తుల వద్ద సంబంధాలు, అనుబంధాలకు ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది.

మానసికంగా చాలా సహజంగా ఉంటారు. జీవితంలో ప్రతి విషయానికి చాలా రిలాక్స్ గా ఉంటారు. జీవితపు సవాళ్ల గురించి ఆలోచించడం, వాటి గురించి కంగారు పడటం వీరిలో ఉండదు. వీరు ఎంజాయ్ చేస్తూ చేసే వృత్తులంటే ఇష్టపడతారు. సీరియస్ గా ఉండటం వీరికి నచ్చదు.

వంపు తిరిగిన పాదాలు..

వంపు తిరిగన పాదాలు ఉన్నవారికి దూర దృష్టి ఎక్కువ. వీరు స్వాతంత్ర్య భావాలు కలిగి ఉంటారు. వీరికి ప్రతిభ ఎక్కువ. చాలా లోతుగా ఆలోచిస్తారు. వీరు ఆలోచనాత్మకంగా ఆత్మపరిశీలనా దృష్టితో ఉంటారు. వీరికి ఏకాంతం అంటే ఇష్టం. చదవడం, నేర్చుకోవడం, జ్ఞానాన్ని ఆర్జించడం పట్ల వీరికి ఆసక్తి ఉంటుంది.

జీవితంలో సవాళ్లంటే ఇష్టపడతారు, సవాళ్లను తెలివిగా ఎదుర్కుంటారు. లక్ష్యాలను సాధించడం పట్ల ఉత్సాహంగా ఉంటారు. వీరిది బలమైన వ్యక్తిత్వం కావడం వల్ల కష్టమైన పనులలో అయినా సరే.. ఇంకొకరి సహాయం తీసుకోవడానికి ఇష్టపడరు. వీరు అంతర్ముఖులు అయినా తమ చుట్టూ ఉన్న పరిస్థితులను బాగా అంచనా వేస్తారు. ఇతరులతో అంత ఈజీగా ఏ బందంలోకి వెళ్లరు.. కానీ ఒకసారి బంధంలోకి వెళ్లాక వారికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఛాలెంజ్ గా ఉన్న వృత్తుల వైపు, పనుల వైపు వీరి చూపు ఉంటుంది. తత్వశాస్త్రం అంటే ఇష్టపడతారు.

Thanks for reading Personality Test: మీ పాదాల వంపు మీ వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పేస్తుందట.. ఓసారి చెక్ చేసుకోండి..!

No comments:

Post a Comment