AP Cabinet meeting Highlights @ 11.11.24
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు
ఏపీ అసెంబ్లీ సమావేశాలకు (AP Assembly Session) ముందు.. ఏపీ కేబినెట్ భేటీ అయింది. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రి వర్గం రాష్ట్ర 2024-25 వార్షిక బడ్జెట్ కు ఆమోదం తెలిపింది.
అనంతరం మంత్రి పయ్యావుల కేశవ్ (Minister Payyavula Keshav) బడ్జెట్ ప్రతులను తీసుకుని అంతకు ముందు సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu), మంత్రులు వెంకటపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి (NTR Statue) పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మంత్రులు లోకేశ్, నారాయణ, పార్థసారథి, కొండపల్లి శ్రీనివాస్, సవిత, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సీఎం వెంట ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ రాజధాని రైతుల్ని పలుకరించారు. అమరావతి ఉద్యమంలో వారంతా కీలక పాత్ర పోషించారని అభినందించారు.
ఏపీ అసెంబ్లీలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సోమవారం వ్యవసాయశాఖ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. మొత్తం రూ.43,402 కోట్లతో అగ్రికల్చర్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 62శాతం జనాభా వ్యవసాయ అనుబంధ రంగాలపై ఆధారపడి ఉందని, గత ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని గాలికొదిలేసిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం హయాంలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాల అభివృద్ధికి పెద్దపీట వేయడం జరిగిందని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే భూసార పరీక్షలకు తిరిగి ప్రాధాన్యతను ఇస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా రైతుల ఆర్థికాభివృద్ధికోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు ఈ బడ్జెట్ లో నిధులు కేటాయించారు.
కేటాయింపులు ఇలా..
రాయితీ విత్తనాలకు రూ.240 కోట్లు
అన్నదాత సుఖీభవ రూ.4,500 కోట్లు.
భూసార పరీక్షలకు రూ.38.88 కోట్లు.
విత్తనాల పంపిణీ రూ.240 కోట్లు.
ఎరువుల సరఫరా రూ.40 కోట్లు.
పొలం పిలుస్తోంది రూ.11.31కోట్లు.
ప్రకృతి వ్యవసాయంకు రూ.422.96 కోట్లు.
డిజిటల్ వ్యవసాయంకు రూ.44.77కోట్లు.
వ్యవసాయ యాంత్రీకరణకు రూ.187.68 కోట్లు.
వడ్డీ లేని రుణాలకు రూ.628కోట్లు.
రైతు సేవా కేంద్రాలకు రూ.26.92కోట్లు.
ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్స్ రూ.44.03 కోట్లు.
పంటల బీమా పథకానికి రూ.1,023 కోట్లు.
వ్యవసాయ శాఖ రూ.8,564.37కోట్లు.
ఉద్యానవన శాఖ రూ.3469.47 కోట్లు.
పట్టు పరిశ్రమ రూ.108.4429 కోట్లు.
వ్యవసాయ మార్కెటింగ్ రూ.314.80 కోట్లు.
సహకార శాఖ రూ.308.26 కోట్లు.
ఎన్జీ రంగా విశ్వవిద్యాలయంకు రూ.507.038 కోట్లు.
ఉద్యాన విశ్వవిద్యాలయంకు రూ.102.227 కోట్లు.
శ్రీ వెంకటేశ్వర పశు విశ్వవిద్యాలయంకు రూ.171.72 కోట్లు.
మత్స్య విశ్వవిద్యాలయం రూ.38కోట్లు.
పశుసంవర్ధక శాఖ రూ.1,095.71 కోట్లు.
మత్స్య రంగం అభివృద్ధి కోసం రూ.521.34 కోట్లు.
ఉచిత వ్యవసాయ విద్యుత్ రూ.7241.30 కోట్లు.
ఉపాధి హమీ అనుసంధానం రూ.5,150 కోట్లు.
ఎన్టీఆర్ జలసిరి రూ.50కోట్లు.
నీరుపారుదల ప్రాజెక్టుల నిర్వహణ రూ.14,637.03 కోట్లు.
కాగా.. ఈసారి రాష్ట్ర బడ్జెట్ సూపర్ సిక్స్ (Supersix) హామీలను నెరవేర్చే దిశగా ఉందని టీడీపీ నేతలు చెబుతున్నారు. సంక్షేమం, అభివృద్ధికి బడ్జెట్ లో పెద్దపీట వేసినట్లు పేర్కొంటున్నారు.
ఏపీ ప్రభుత్వం 2024-25 వార్షిక బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశ పెట్టింది. 2.94 లక్షల కోట్లతో ఈ బడ్జెట్ ప్రతిపాదనలు సభ ముందు ఉంచింది. ఆర్దిక మంత్రి పయ్యావుల తన బడ్జెట్ లో సంక్షేమ రంగానికి ప్రాధాన్యత ఇచ్చారు.
అదే విధంగా రాష్ట్రంలో ఆర్దిక కష్టాలను వివరించారు. తమ ముందు ఉన్న బాధ్యతలను ప్రస్తావించారు. వ్యవసాయ, పంచాయితీ రాజ్, విద్య రంగాలకు ప్రాధాన్యత ఇచ్చారు. ఇదే సమయంలో సూపర్ సిక్స్ పథకాల గురించి మంత్రి కేశవ్ తన బడ్జెట్ ప్రసంగంలో స్పష్టత ఇచ్చారు.
బడ్జెట్ లో క్లారిటీ
ఆర్దిక మంత్రి పయ్యావుల కేశవ్ గత ప్రభుత్వం ఆర్దిక నిర్వహణలో చేసిన లోపాలను ప్రధానంగా బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తావించారు. పారిశ్రామిక రంగం దెబ్బ తిందని వివరించారు. ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలను వివరించారు. రాష్ట్ర ఆర్దిక వ్యవస్థ పతనం అంచున ఉందని చెప్పుకొచ్చారు. రాష్ట్ర భవిష్యత్ కోసం తమ ప్రభుత్వం కట్టబుడి ఉందని వెల్లడించారు. గత ప్రభుత్వం వనరులను దారి మళ్లించిందని చెప్పారు. గత ప్రభుత్వ లోప బూయిష్ట విధానాల కారణంగా రాష్ట్ర ఆర్దిక వ్యవస్థ దెబ్బ తిందని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం అభివృద్ధి - సంక్షేమ రంగాలకు ప్రాధాన్యత ఇస్తుందని హామీ ఇచ్చారు.
ఉచిత బస్సు ప్రయాణం
కేవశ్ బడ్జెట్ ప్రసంగంలో ఎన్నికల సమయంలో తాము ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల గురించి ప్రస్తావన చేసారు. ప్రభుత్వం హామీలకు కట్టుబడి ఉందని చెప్పారు. అధికారంలోకి వచ్చిన నెల నుంచే చెప్పినట్లుగా అంతకు ముందు రెండు నెలలో కలిపి నెలకు రూ 4 వేల నుంచి రూ 15 వేల వరకు పెన్షన్లు అందిస్తున్నామని వివరించారు. సూపర్ సిక్స్ హామీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఈ ఆర్దిక సంవత్సరంలోనే ప్రారంభించేలా పయ్యావుల తన ప్రసంగంలో సంకేతాలు ఇచ్చారు. అదే సమయంలో ఇతర పథకాల ప్రస్తావన చేయలేదు. రైతులకు ఇచ్చిన హామీల గురించి వివరించారు.
వచ్చే ఆర్దిక సంవత్సరంలో
అయితే, మహిళలకు ప్రతీ నెల రూ 1500 ఇస్తామని ఎన్నికల సమయంలో కూటమి నేతలు హామీ ఇచ్చారు. ఇప్పుడు ఈ పథకం అమలు వచ్చే ఆర్దిక సంవత్సరంలోనే అమలు చేసే ఆలోచనలో ఉందని తెలుస్తోంది. ప్రస్తుత బడ్జెట్ లో ఈ పథకం గురించి ప్రత్యేకంగా ప్రస్తావన చేయలేదు. రాష్ట్ర ఆర్దిక పరిస్థితి గురించే ఎక్కువగా వివరించారు. మహిళలకు అమలు చేస్తున్న దీపం పథకం గురించి కేశవ్ గుర్తు చేసారు. అదే విధంగా అమ్మకు వందనం పథకం సైతం వచ్చే ఆర్దిక సంవత్సరంలోనే అమలు చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ పథకం కోసం నిధుల ప్రస్తావన కేశవ్ తన ప్రసంగంలో చేయకపోవటంతో.. రానున్న నాలుగు నెలల కాలంలో ఈ పథకం అమలయ్యే అవకాశం లేదనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి.
Thanks for reading AP Cabinet meeting Highlights @ 11.11.24
No comments:
Post a Comment