Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Thursday, December 26, 2024

Rules change 2025: Impact on your pocket in the new year.. Key changes from January 1!


 Rules Change 2025: కొత్త ఏడాదిలో మీ జేబుపై ప్రభావం.. జనవరి 1 నుంచి కీలక మార్పులు!

2024 సంవత్సరం ముగియబోతోంది. ఇప్పుడు కొత్త సంవత్సరంలో కొత్త కోరికలు, కొత్త ఖర్చులు ఉంటాయి. అందువల్ల జనవరి 1, 2025 నుండి ఏయే ముఖ్యమైన విషయాలు మారబోతున్నాయో తెలుసుకోవడం మీకు చాలా ముఖ్యం.

Financial changes in 2025 : ఆర్థిక విషయాల్లో ఈ ఏడాది ఎన్నో మార్పులు వచ్చాయి. కొత్త ఏడాదిలోనూ ఈ ఒరవడి కొనసాగనుంది. కార్ల ధరలు పెరగనున్నాయి. వీసా నిబంధనల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. అమెజాన్‌ ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌ విషయంలోనూ కొత్త నిబంధనలు రాబోతున్నాయి. ఇవన్నీ మనపై ఏదో విధంగా ప్రభావం చూపేవే. మరికొన్ని రోజుల్లో 2024కు వీడ్కోలు పలికి కొత్త ఏడాదిలోకి అడుగుపెడుతున్న వేళ వచ్చే మార్పులేమిటో ఇప్పుడు చూద్దాం..

ఇది నేరుగా మీ జేబుపై ప్రభావం చూపుతుంది. పలు కార్ల కంపెనీలు తమ ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. ఇది కాకుండా, జీఎస్టీ పోర్టల్‌లో మూడు ముఖ్యమైన మార్పులు ఉంటాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) ఫిక్స్‌డ్ డిపాజిట్లకు (ఎఫ్‌డి) సంబంధించిన పాలసీలలో కూడా మార్పులు చేసింది.

టెలికాం కంపెనీల కొత్త నిబంధనలు

జనవరి 1, 2025 నుండి టెలికాం కంపెనీలకు కొన్ని కొత్త నిబంధనలు వర్తిస్తాయి. ఈ రంగంలోని కంపెనీలు ఆప్టికల్ ఫైబర్, కొత్త మొబైల్ టవర్లను ఇన్‌స్టాల్ చేయడంపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. దీంతో యూజర్ల అనుభవంతో పాటు సేవలను మెరుగుపరచటానికి సహాయపడతాయి. టవర్‌ను ఇన్‌స్టాల్ చేసే ప్రక్రియలో తక్కువ అవాంతరం ఉంటుంది.

అమెజాన్ ప్రైమ్‌లో మార్పులు

అమెజాన్ ఇండియా తన ప్రైమ్ మెంబర్‌షిప్ నియమాలను జనవరి 1, 2025 నుండి మార్చింది. ఇప్పుడు ప్రైమ్ వీడియోను ఒక ఖాతా నుండి రెండు టీవీలలో మాత్రమే ప్రసారం చేయవచ్చు. దీని కంటే ఎక్కువ టీవీలో ప్రసారం చేయడానికి, అదనపు సబ్‌స్క్రిప్షన్ తీసుకోవలసి ఉంటుంది. మొదటి ఐదు డివైజ్‌ల వరకు ఎటువంటి పరిమితి లేదు.

జీఎస్టీ పోర్టల్‌లో మార్పులు:

GSTN జనవరి 1, 2025 నుండి GST పోర్టల్‌లో మూడు ముఖ్యమైన మార్పులను ప్రకటించింది. వీటిలో రెండు మార్పులు ఇ-వే బిల్లు కాలపరిమితి, చెల్లుబాటుకు సంబంధించినవి. ఒక మార్పు జీఎస్టీ పోర్టల్‌కి సురక్షిత యాక్సెస్‌కి సంబంధించినది. ఈ నిబంధనలను సరిగ్గా అమలు చేయకపోతే కొనుగోలుదారు, విక్రేత, రవాణాదారు నష్టపోవచ్చు.

RBI FD నియమాలలో మార్పులు

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనవరి 1, 2025 నుండి NBFCలు, HFCల ఫిక్స్‌డ్ డిపాజిట్లకు (FD) సంబంధించిన విధానాలను మార్చింది. వీటిలో ప్రజల నుండి డిపాజిట్లు తీసుకునే నియమాలకు సంబంధించిన మార్పులు, లిక్విడ్ ఆస్తులను ఉంచే శాతం, డిపాజిట్లను బీమా చేయడం వంటివి ఉన్నాయి.

కార్ల ధరలు పెరగనున్నాయి:

కొత్త సంవత్సరం రాగానే కార్ల ధరలు పెరగనున్నాయి. పలు ప్రధాన కార్ల కంపెనీలు ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. మారుతీ సుజుకి, హ్యుందాయ్, మహీంద్రా, మెర్సిడెస్ బెంజ్, బిఎమ్‌డబ్ల్యూ, ఆడి ఇందులో ఉన్నాయి. ఈ కంపెనీలు ధరను సుమారు 3% పెంచనున్నాయి.

ఎల్‌పీజీ ధర:

చమురు కంపెనీలు ప్రతి నెలా మొదటి తేదీన ఎల్‌పిజి ధరలను సమీక్షిస్తాయి. గత ఐదు నెలల్లో 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది. అయితే 14.2 కిలోల డొమెస్టిక్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు. ఇప్పుడు ఢిల్లీలో డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.803.

అతి పెద్ద గ్రామీణ బ్యాంక్‌గా..

గ్రామీణ బ్యాంకులను పటిష్ఠ పరిచేలా కేంద్రం తీసుకున్న ‘ఒక రాష్ట్రం.. ఒక గ్రామీణ బ్యాంకు’ అనే నినాదంతో ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ వికాస్‌ బ్యాంక్‌ (APGVB)కు చెందిన తెలంగాణలోని శాఖలన్నీ ఇకపై తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌ (TGB)లో విలీనం కానున్నాయి. జనవరి 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది. ప్రస్తుతం ఏపీజీవీబీ తెలుగు రాష్ట్రాల్లో 771 శాఖలతో సేవలందిస్తోంది. దీనికి తెలంగాణలో ఉన్న 493 శాఖలు టీజీబీలో విలీనమవుతాయి. దీంతో దేశంలోని అతిపెద్ద గ్రామీణ బ్యాంకుల్లో ఒకటిగా తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌ అవతరించనుంది.

లిమిట్‌ పెంపు

స్మార్ట్‌ఫోన్‌, ఇంటర్నెట్‌ కనెక్షన్‌ లేకుండా యూపీఐ సేవల్ని అందించేందుకు తీసుకొచ్చిన UPI123PAY పరిమితి కూడా వచ్చే ఏడాది నుంచి పెరగనుంది. రూ.5 వేల నుంచి రూ.10 వేలకు లిమిట్‌ చేరుతుంది. ఫీచర్‌ ఫోన్‌ వినియోగదారుల కోసం ఈ సదుపాయాన్ని ఎన్‌పీసీఐ తీసుకొచ్చింది.

ఈ-వీసాతో థాయ్‌లాండ్‌

వచ్చే ఏడాది నుంచి ఏ దేశానికి చెందిన వ్యక్తులైనా థాయ్‌లాండ్‌ వీసా వెబ్‌సైట్‌ ద్వారా సులువుగా ఈ- వీసా కోసం దరఖాస్తు చేయొచ్చు. గతంలో ఈ- వీసా సదుపాయం కేవలం కొన్ని ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికులకు మాత్రమే అందుబాటులో ఉండేది. 2025 జనవరి 1 నుంచి ఏ దేశం వారైనా ఆన్‌లైన్‌లో సులువుగా వీసా కోసం దరఖాస్తు చేసుకొనే సదుపాయాన్ని తీసుకురానుంది. 

వీసా రీ షెడ్యూల్‌ ఒకసారి ఫ్రీ

అమెరికా వెళ్లాలనుకునే వారి కోసం అగ్రరాజ్యం కొన్ని కీలక మార్పులు చేపట్టనుంది. నాన్‌ ఇమిగ్రెంట్ వీసా కోసం దరఖాస్తు చేసుకునేవారు మీకు నచ్చిన లొకేషన్‌లో ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్‌ను షెడ్యూల్‌ చేసుకోవచ్చు. ఒకవేళ ఏ కారణం చేతనైనా మీరు రీషెడ్యూల్‌ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తే.. ఎలాంటి అదనపు రుసుము లేకుండా ఒకసారి షెడ్యూల్‌ను మార్చుకోవచ్చు. వచ్చే జనవరి 1 నుంచి ఈ మార్పు అమల్లోకి రానుంది. మరోసారి రీషెడ్యూల్‌ చేసుకోవాల్సి వస్తే రుసుము చెల్లించాల్సిందే.

ఐటీసీ హోటల్‌ డీమెర్జర్‌

వేర్వేరు వ్యాపార కార్యకలాపాల్లో నిమగ్నమైన ఐటీసీ లిమిటెడ్ ఐటీసీ హోటల్స్‌ పేరుతో ఆతిథ్య వ్యాపారాన్ని వేరు చేయనుంది. వచ్చే ఏడాది జనవరిలో ఈ డీమెర్జర్‌ ప్రక్రియ పూర్తి కానుంది.

Thanks for reading Rules change 2025: Impact on your pocket in the new year.. Key changes from January 1!

No comments:

Post a Comment