SBI Probationary Officer Notification 2024-25 PDF Out, Online Form for 600 Posts
SBI Probationary Officer: ఎస్‌బీఐలో 600 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులు
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ), సెంట్రల్ రిక్రూట్‌మెంట్ & ప్రమోషన్ డిపార్ట్‌మెంట్, కార్పొరేట్ సెంటర్... పీవో ఖాళీల భర్తీకి ప్రకటనను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 600 ప్రొబేషనరీ ఆఫీసర్ల నియమకాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి 27.12.2024 నుంచి 16.01.2025 వరకు అవకాశం ఉంది. అభ్యర్థులను ప్రిలిమ్స్, మెయిన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. పీవోగా ఎంపికైతే రెండేళ్లు ప్రొబేషనరీ పీరియడ్ ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు దేశ వ్యాప్తంగా ఉన్న ఎస్‌బీఐ శాఖల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
ప్రకటన వివరాలు:
★ ప్రొబేషనరీ ఆఫీసర్: 600 పోస్టులు (ఎస్సీ- 87, ఎస్టీ- 57, ఓబీసీ- 158, ఈడబ్ల్యూఎస్- 58, యూఆర్- 240)
అర్హతలు: ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత. చివరి సంవత్సరం ఫైనల్ పరీక్షలు రాసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి (01.04.2024 నాటికి): 21 - 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీత భత్యాలు: నెలకు రూ.48,480 నుంచి రూ.85,920.
దరఖాస్తు రుసుము: రూ.750 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు చెల్లింపు మినహాయింపు ఉంటుంది).
ఎంపిక విధానం: ఫేజ్ 1- ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, ఫేజ్ 2- మెయిన్ ఎగ్జామినేషన్, ఫేజ్ 3- సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ ఎక్సర్‌సైజ్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ప్రిలిమినరీ పరీక్ష అంశాలు: ఇంగ్లిష్ లాంగ్వేజ్ (40 ప్రశ్నలు), క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ (30 ప్రశ్నలు), రీజనింగ్ ఎబిలిటీ (30 ప్రశ్నలు).
మొత్తం ప్రశ్నల సంఖ్య: 100. గరిష్ఠ మార్కులు: 100. పరీక్ష వ్యవధి: 1 గంట.
మెయిన్స్ సబ్జెక్టులు: రీజనింగ్ & కంప్యూటర్ ఆప్టిట్యూడ్ (40 ప్రశ్నలు- 60 మార్కులు), డేటా అనాలిసిస్ & ఇంటర్‌ప్రెటేషన్ (30 ప్రశ్నలు- 60 మార్కులు), జనరల్ అవేర్‌నెస్/ ఎకానమీ/ బ్యాంకింగ్ నాలెడ్జ్ (60 ప్రశ్నలు- 60 మార్కులు), ఇంగ్లిష్ లాంగ్వేజ్- 420 ప్రశ్నలు మార్కులు).
మొత్తం ప్రశ్నల సంఖ్య: 170. గరిష్ఠ మార్కులు: 200. పరీక్ష వ్యవధి: 3 గంటలు.
తెలుగు రాష్ట్రాల్లో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సెంటర్లు: చిత్తూరు, ఏలూరు, గుంటూరు/ విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పరీక్ష కేంద్రాలు: గుంటూరు/ విజయవాడ, కర్నూలు, విశాఖపట్నం, హైదరాబాద్.
ముఖ్య తేదీలు...
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, దరఖాస్తు సవరణ తేదీలు: 27.12.2024 నుంచి 16.01.2025 వరకు.
దరఖాస్తు రుసుము చెల్లింపు తేదీలు: 27.12.2024 నుంచి 16.01.2025 వరకు.
ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కాల్ లెటర్ల డౌన్‌లోడ్: 2025, ఫిబ్రవరి మూడు లేదా నాలుగో వారంలో ప్రారంభం.
స్టేజ్ 1- ఆన్‌లైన్ ప్రిలిమినరీ పరీక్ష తేదీలు: 2025, మార్చి 8, 15.
ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల ప్రకటన: ఏప్రిల్ 2025.
మెయిన్ ఎగ్జామినేషన్ కాల్ లెటర్ డౌన్‌లోడ్: 2025, ఏప్రిల్ రెండో వారం.
స్టేజ్ 2- ఆన్‌లైన్ మెయిన్ ఎగ్జామ్: 2025, ఏప్రిల్/ మే.
ప్రధాన పరీక్ష ఫలితాల ప్రకటన: మే/ జూన్ 2025.
ఫేజ్-3 కాల్ లెటర్ డౌన్‌లోడ్: మే/ జూన్, 2025.
ఫేజ్ 3- సైకోమెట్రిక్ పరీక్ష: మే/ జూన్, 2025.
ఇంటర్వ్యూ, గ్రూప్ ఎక్సర్‌సైజ్ తేదీలు: మే/ జూన్, 2025.
తుది ఫలితాల ప్రకటన: మే/ జూన్, 2025.
ముఖ్యాంశాలు:
★ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా- పీవో ఖాళీల భర్తీకి ప్రకటనను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 600 ప్రొబేషనరీ ఆఫీసర్ల నియమకాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
★ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి 27.12.2024 నుంచి 16.01.2025 వరకు అవకాశం ఉంది.
★ అభ్యర్థులను ప్రిలిమ్స్, మెయిన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
ద్వారా ఎంపిక చేస్తారు.
SBI Probationary Officer Posts Recruitment Notification
Thanks for reading SBI Probationary Officer Notification 2024-25 PDF Out, Online Form for 600 Posts
No comments:
Post a Comment