హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో 500 రిలేషన్‌షిప్ మేనేజర్ ఉద్యోగాలు
హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్.. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) సహకారంతో రిలేషన్‌షిప్ మేనేజర్ - ప్రొబేషనరీ ఆఫీసర్ (పిఓ) ప్రోగ్రామ్‌కు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు ఫిబ్రవరి 7వ తేదీ లోగా దరఖాస్తులు చేసుకోవాలి.
పోస్టు: ఖాళీల సంఖ్య
* రిలేషన్‌షిప్ మేనేజర్ (RM) - 500 పోస్టులు
అర్హత: అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 50% మార్కులతో గ్రాడ్యుయేషన్ డిగ్రీని కలిగి ఉండాలి, 1 - 10 సంవత్సరాల ఉద్యోగానుభవం ఉండాలి.
వయసు: దరఖాస్తు చివరి తేదీ నాటికి 35 ఏళ్లు మించకూడదు.
జీతం: ఏడాదికి రూ.3,00,000 - రూ.12,00,000 వరకు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ పరీక్ష, వ్యక్తిగత ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
ఉద్యోగ స్థానం: దేశవ్యాప్తంగా గల ప్రధాన నగరాల్లో.
పరీక్ష కేంద్రాలు: విశాఖపట్నం, దిల్లీ, అహ్మాదాబాద్, వడోదర, బెంగళూరు, మంగళూరు, భోపాల్, ముంబయి, పుణె, అమృత్‌సర్, జయపుర, హైదరాబాద్, లఖ్‌నవూ, కోల్‌కతా.
ముఖ్యమైన తేదీలు:
* ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 30.12.2024
* ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 07.02.2025
* ఆన్‌లైన్ పరీక్ష: మార్చి 2025
HDFC, Relationship Managers - PO Program
Thanks for reading HDFC Bank PO Recruitment 2025 Notification OUT for 500 Relationship Manager Positions, Apply Online
No comments:
Post a Comment