IDBI PGDBF: 2025-26 రిక్రూట్‌మెంట్ - 650 పోస్టులు
ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఐడీబీఐ) 650 జూనియర్ అసిస్టెంట్ మేనేజర్‌ల (గ్రేడ్ 'O') ఖాళీల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. డిగ్రీ అర్హతతో దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష, ఇంటర్వ్యూలతో నియామకాలు ఉంటాయి. ఎంపికైనవారు ఏడాది వ్యవధితో పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ (పీజీడీబీఎఫ్) కోర్సు పూర్తిచేయాలి. మణిపాల్ స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్, బెంగళూరులో పీజీ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ (పీజీడీబీఎఫ్) కోర్సు పూర్తిచేయాలి. ఏడాది కోర్సులో 6 నెలల తరగతి గది శిక్షణ, 2 నెలలు ఇంటర్న్‌షిప్, 4 నెలలు ఆన్ జాబ్ ట్రైనింగ్ ఉంటాయి.అందులో విజయవంతమైనవారిని విధుల్లోకి తీసుకుంటారు. కోర్సులో ప్రతి నెలా స్టైపెండ్ అందుతుంది. ఉద్యోగంలో చేరిన తరువాత ఏడాదికి రూ.6.5 లక్షల వేతనం చెల్లిస్తారు.
పోస్టు పేరు: ఖాళీలు:
జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ (గ్రేడ్ ‘ఓ’)- 650 ఖాళీలు
(యూఆర్: 260, ఎస్సీ: 100, ఎస్టీ: 54, ఈడబ్ల్యూఎస్: 65, ఓబీసీ: 171, పీడబ్ల్యూడీ: 26)
అర్హత: అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ డిగ్రీని కలిగి ఉండాలి. కంప్యూటర్ ప్రావీణ్యం, ప్రాంతీయ భాష పరిజ్ఞానం ఉండాలి. చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి: మార్చి 1, 2025 నాటికి 20 - 25 సంవత్సరాలు ఉండాలి.
జీతం, స్టైపెండ్: శిక్షణ సమయంలో నెలకు రూ.5,000; ఇంటర్న్‌షిప్ సమయంలో నెలకు రూ.15,000. ఉద్యోగంలో చేరిన తర్వాత ఏడాదికి రూ.6.14 లక్షల నుంచి రూ6.50 అందుతుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు రుసుము: ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు రూ.250; ఇతరులు రూ.1,050.
పరీక్షా కేంద్రాలు: ముంబయి, దిల్లీ, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, అహ్మదాబాద్, లఖ్‌నవూ, పట్న తదితర నగరాల్లో.
ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు..
* ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 01.03.2025.
* దరఖాస్తు & ఫీజు చెల్లింపుకు చివరి తేదీ: 12.03 2025.
* ఆన్‌లైన్ పరీక్ష తేదీ: 06.04.2025.
IDBI PGDBF 2025-26 Recruitment Notification
Thanks for reading IDBI Junior Assistant Manager Recruitment 2025 Notification Out for 650 Vacancies
No comments:
Post a Comment