JEE Main 2025: జేఈఈ మెయిన్ తొలి విడత ప్రాథమిక కీ
ఫిబ్రవరి 4 నుంచి 6 వరకు అభ్యంతరాల స్వీకరణకు గడువు
దేశవ్యాప్తంగా జనవరి 22 నుంచి 29తేదీల మధ్య జరిగిన జేఈఈ మెయిన్ సెషన్-1 (జనవరి 2025) ప్రాథమిక ఫలితాలను ఎన్‌టీఏ విడుదల చేసింది. ఫిబ్రవరి 4 నుంచి 6వ తేదీ వరకు అభ్యంతరాలను తెలుపవచ్చు. ఎన్‌ఐటీల్లో బీటెక్ సీట్ల భర్తీకి పేపర్-1, 30వ తేదీన బీఆర్క్, బీ ప్లానింగ్ సీట్ల కోసం పేపర్-2 జరిగిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా రెండు పేపర్లకు కలిపి 12 లక్షల మందికిపైగా దరఖాస్తు చేశారు. రోజూ ఉదయం 9-12 గంటల వరకు, మధ్యాహ్నం 3- 6 గంటల వరకు రెండు షిఫ్టుల్లో పరీక్షలు జరిగాయి.
ఏప్రిల్‌లో రెండో విడత పరీక్షలు
ఏప్రిల్ 1 నుంచి 8వ తేదీల మధ్య రెండో విడత జేఈఈ మెయిన్ పరీక్షలు జరుగుతాయి. రెండింట్లో వచ్చిన ఉత్తమ స్కోర్ ఆధారంగా ర్యాంకులు కేటాయిస్తారు. జేఈఈ మెయిన్‌లో కనీస మార్కులు సాధించిన 2.50 లక్షల మంది మే 18న జేఈఈ అడ్వాన్స్‌డ్ రాసేందుకు అవకాశం ఉంటుంది. జేఈఈ మెయిన్ ర్యాంకులతో ఎన్‌ఐటీలు, అడ్వాన్స్‌డ్ ర్యాంకులతో ఐఐటీల్లో సీట్లు పొందొచ్చు. దేశంలోని 31 ఎన్‌ఐటీల్లో గత ఏడాది సుమారు 24 వేలు, 23 ఐఐటీల్లో 17,600, ట్రిపుల్‌ఐటీల్లో దాదాపు 8,500, ఇతర కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే విద్యాసంస్థల్లో 57 వేల సీట్లు ఉన్నాయి. జేఈఈ మెయిన్ రాసిన ప్రతి 100 మందిలో సరాసరిన నలుగురికి మాత్రమే సీట్లు దక్కుతున్నాయి. జేఈఈ మెయిన్ చివరి విడత ముగిసిన తర్వాత రెండిటిలో ఉత్తమ స్కోర్ (రెండూ రాస్తే)ను పరిగణనలోకి తీసుకొని ఏప్రిల్ 17వ తేదీ నాటికి ర్యాంకులు ప్రకటిస్తారు. జేఈఈ మెయిన్ చివరి విడత దరఖాస్తులకు ఫిబ్రవరి 25 వరకు గడువు ఉంది.
Answer Key Challenge for JEE(Main) 2025 Session-1
Thanks for reading JEE main 2025: JEE main session-1 primary key
No comments:
Post a Comment