Plantix App for Farmers: 3 కోట్ల మంది రైతులు ఉపయోగిస్తున్న అగ్రికల్చర్ యాప్.. ఒక్క క్లిక్‌తో బోలెడు ప్రయోజనాలు!
Plantix App for Farmers : ప్రస్తుతం టెక్నాలజీ యుగం నడుస్తోంది. అన్నీ పనులు సాంకేతికత మీదే ఆధారపడి నడుస్తున్నాయి. ఇదే క్రమంలో వ్యవసాయం కూడా నెమ్మదిగా సాంకేతికత దిశగా అడుగులు వేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ క్రమంలో పంటలకు సోకే వివిధ రకాల తెగుళ్లు, క్రిమి కీటకాలాను గుర్తించడం, పంట సమస్యలను గుర్తించి చికిత్స చేయడం, ఉత్పాదకతను మెరుగుపరుచుకోవడం, వ్యవసాయ విజ్ఞానాన్ని అందించడంలో రైతుల కోసం కూడా ఓ యాప్ ఉంది. అదే ప్లాంటిక్స్ యాప్ (Plantix App).
రైతులకు ఈ మొబైల్ యాప్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఇక్రిశాట్ శాస్త్రవేత్తలు అంటున్నారు. సుమారు 3 కోట్ల మంది రైతులు ఉపయోగిస్తున్న ఈ Plantix App ఇప్పటివరకు 60 రకాల పంటలకు సంబందించిన 10 కోట్ల ఫోటోలను ప్లాంటిక్స్ యాప్ లోకి అప్లోడ్ చేయగా.. వాటిని విశ్లేషించి, సుమారుగా 700 రకాల తెగుళ్లను, క్రిమికీటకాలు ప్లాంటిక్స్ యాప్ (Plantix App) గుర్తించందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రైతులు సులభంగా అర్ధం చేసుకోవడానికి వీలుగా వారి వారి స్థానిక భాషలోనే సమాచారం ఇచ్చేవిధంగా ఈ Plantix Appని ఇక్రిశాట్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యంలో ఉన్న 20 భాషల్లో ప్లాంటిక్స్ యాప్ తన సేవలను అందిస్తోంది. పదేళ్ల కిందట తయారు చేసిన ఈ యాప్ వాడకం ఇటీవల బాగా పెరిగింది. సామాన్య రైతుల్లో కూడా మొబైల్ ఫోన్ వాడకం బాగా పెరగడంతో ఈ Plantix మొబైల్ యాప్ విపరీతంగా ప్రాచుర్యంలో వచ్చింది.
Plantix App గురించి మరికొంత సమాచారం :
మీ అనారోగ్య పంట ఫోటో తీసి.. ఉచిత వ్యాధి నిర్ధారణ, చికిత్స సూచనలను సెకన్ల వ్యవధిలోనే పొందొచ్చు. మీ స్థానిక రిటైలర్ల నుండి వ్యవసాయ ఉత్పత్తులపై గొప్ప డీల్స్ తెలుసుకోవచ్చు. ధరలను పోల్చి చూడొచ్చు. ఉత్పత్తుల గురించి, వాటిని ఎలా ఉపయోగించాలో తెలుసుకోవచ్చు. పంటలపై ఏవైనా సందేహాలు ఉంటే సంఘ వ్యవసాయ నిపుణులు మీకు సహాయపడతారు. మీరు పంట సాగు గురించి కూడా తెలుసుకోవచ్చు. అలాగే.. మీ అనుభవంతో తోటి రైతులకు సహాయపడవచ్చు. లైబ్రరీ లో మీకు కావలసిన సమాచారమంతా లభిస్తుంది. మీ పంట వ్యాధులు, నివారణ పద్ధతుల సమాచారంతో విజయవంతంగా పంటను సాగుచేయవచ్చు. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా డౌన్‌లోడ్ చేసుకోబడిన అగ్రి టెక్ యాప్‌గా, రైతుల 10 కోట్లకు పైగా పంట సంబంధిత ప్రశ్నలకు ప్లాంటిక్స్ (Plantix App) సమాధానమిచ్చింది.
Thanks for reading Plantix App for Farmers: 3 కోట్ల మంది రైతులు ఉపయోగిస్తున్న అగ్రికల్చర్ యాప్.. ఒక్క క్లిక్‌తో బోలెడు ప్రయోజనాలు!
No comments:
Post a Comment