RRB Technician 2025 Recruitment Notification OUT at rrbcdg.gov.in, Apply Online for 6180 Vacanacies - More Details Here
RRB Technicain: రైల్వేలో 6,180 టెక్నీషియన్ పోస్టులు
దేశవ్యాప్తంగా అన్నీ రైల్వే రీజియన్లలో భారీగా కొలువుల భర్తీకి రంగం సిద్ధమైంది. వివిధ విభాగాల్లో మొత్తం 6,180 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి రైల్వే శాఖ(రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు) నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఎంప్లాయిమెంట్ న్యూస్ ప్రకారం జూన్ 28వ తేదీన పూర్తి నోటిఫికేషన్ విడుదలకానుంది. అర్హులైన అభ్యర్థులు జూన్ 28వ తేదీ నుంచి జులై 28వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. రాత, వైద్య పరీక్షలు తదితరాల ఆధారంగా ఉద్యోగాల ఎంపిక ఉంటుంది.
ఆర్‌ఆర్‌బీ రీజియన్లు: అహ్మదాబాద్, అజ్‌మేర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్‌పూర్, చండీగఢ్, చెన్నై, గువాహటి, జమ్ము అండ్ శ్రీనగర్, కోల్‌కతా, మాల్దా, ముంబయి, ముజఫర్‌పూర్, పట్నా, ప్రయాగ్‌రాజ్, రాంచీ, సికింద్రాబాద్, సిలిగురి, తిరువనంతపురం, గోరఖ్‌పూర్.
ప్రకటన వివరాలు:
1. టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్: 180 పోస్టులు
2. టెక్నీషియన్ గ్రేడ్-III: 6,000పోస్టులు
మొత్తం పోస్టుల సంఖ్య: 6,180.
* అర్హతలు, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, దరఖాస్తు ఫీజు తదితర వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
గమనిక: రీజియన్ల వారీ ఖాళీలు, విద్యార్హత, రాత పరీక్ష, సిలబస్ తదితర పూర్తి వివరాలు త్వరలో విడుదలకానున్నాయి.
RRB Technician Recruitment Notification
Thanks for reading RRB Technician 2025 Recruitment Notification OUT at rrbcdg.gov.in, Apply Online for 6180 Vacanacies - More Details Here
No comments:
Post a Comment