SBI PO 2025 Notification Out for 541 Vacancies, Download PDF
SBI: ఎస్‌బీఐలో 541 ప్రొబేషనరీ ఆఫీసర్ ఉద్యోగాలు
భారతీయ అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) 2025 సంవత్సరానికి 541 పీఓ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు దేశ వ్యాప్తంగా పోస్టింగ్ అవకాశాలతో ఆఫీసర్ స్థాయి కెరీర్ ప్రారంభించాలనుకునే వారికి ఇది ఒక మంచి అవకాశం. ఉద్యోగానికి తగిన విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు జూన్ 24వ తేదీ నుంచి జులై 14 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు. జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.750 దరఖాస్తు ఫీజు ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు లేదు.
పోస్టు పేరు- ఖాళీలు
* ప్రొబేషనరీ ఆఫీసర్ (PO): 541
ఎస్సీ: 80
ఎస్టీ: 73
ఓబీసీ: 135
ఈడబ్ల్యూఎస్: 50
యూఆర్: 203
అర్హత: అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ (Graduation) పూర్తి చేసి ఉండాలి. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. 30.09.2025 లోగా డిగ్రీ పూర్తిచేసి ధ్రువీకరణ పత్రాన్ని చూపాలి. మెడికల్, ఇంజినీరింగ్, సీఏ, కాస్ట్ అకౌంటెంట్ చేసిన అభ్యర్థులు అర్హులు.
గరిష్ఠ వయోపరిమితి: 01.04.2025వ తేదీ నాటికి కనీస వయస్సు 21 ఏళ్లు, గరిష్ఠ వయస్సు 30 సంవత్సరాలు. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 - 15 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
వేతనం: నెలకు రూ.48,480. అడ్వాన్స్ ఇంక్రిమెట్లు, డీఏ, హెచ్‌ఆర్‌ఏ, సీసీఏ, పీఎఫ్, ఎన్‌పీఎఫ్ ఇతర అలవెన్సులు లభిస్తాయి.
దరఖాస్తు ప్రక్రియ: అభ్యర్థులు 24.06.2025 నుంచి 14.07.2025 వరకు ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్ (https://bank.sbi/web/careers) లో ఆన్‌లైన్ ద్వారా అప్లై చేయాలి. అప్లికేషన్ ఫీజు చెల్లింపుతో రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. మిగతా డాక్యుమెంట్లు పంపించాల్సిన అవసరం లేదు.
దరఖాస్తు ప్రారంభ తేదీ: 24 జూన్ 2025.
ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 14 జులై 2025.
దరఖాస్తు ఫీజు: జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.750. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు లేదు. (ఫీజు రీఫండ్ ఉండదు).
ఎంపిక ప్రక్రియ:
పోస్టుకు ఎంపిక మూడు దశల పరీక్షల ద్వారా జరగుతుంది:
* ప్రిలిమినరీ పరీక్ష
* మెయిన్ పరీక్ష (లక్ష్యం + వివరణాత్మక)
* సైకోమెట్రిక్ పరీక్ష + గ్రూప్ డిస్కషన్ + ఇంటర్వ్యూ ఆధారంగా.
ప్రత్యేకంగా ప్రిలిమ్స్ మార్కులు తుది మెరిట్ లిస్టులో పరిగణనలోకి రావు. ఫైనల్ ఎంపిక ఫేజ్-II & ఫేజ్-III స్కోర్ ఆధారంగా ఉంటుంది.
SBI PO-2025 Recruitment Notification
Thanks for reading SBI PO 2025 Notification Out for 541 Vacancies, Download PDF
No comments:
Post a Comment