IBPS PO Recruitment 2025 : గుడ్ న్యూస్ ... 5,208 బ్యాంకు ఉద్యోగాల భర్తీకి కొత్త నోటిఫికేషన్
IBPS PO/MT: 5,208 పోస్టులతో ఐబీపీఎస్ పీఓ నోటిఫికేషన్
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (IBPS) 2026–27 సంవత్సరానికి తాజాగా ప్రొబేషనరీ ఆఫీసర్స్/ మేనేజ్‌మెంట్ ట్రైనీస్(PO/MT) ఉద్యోగాల భర్తీకి 5,208 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రిలిమినరీ, మెయిన్స్, వ్యక్తిత్వ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఐబీపీఎస్ నియామక ప్రక్రియ చేపట్టనుంది. అర్హత గల అభ్యర్థులు జులై 1వ తేదీ నుంచి 21 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టుల వివరాలు:
పోస్ట్ పేరు - ఖాళీలు
☞ ప్రొబేషన్‌రీ ఆఫీసర్/మేనేజ్‌మెంట్ ట్రెయినీ (PO/MT): 5,208
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో 21 జూలై 2025 నాటికి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత ఉండాలి. మార్కుల ప్టటాలు/సర్టిఫికెట్లు తప్పనిసరిగా ఉండాలి.
వయో పరిమితి: 2025 జులై 1వ తేదీ నాటికి 20 - 30 ఏళ్లు ఉండాలి. (02.07.1995 నుంచి 01.07.2005 మధ్య జన్మించినవారు అర్హులు). ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 ఏళ్లు, ఈఎస్‌ఎం అభ్యర్థులకు 5 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
జీతం: నెలకు రూ.48,480 – రూ.85,920 (బేసిక్ పే) + ఇతర అలవెన్సులు బ్యాంకు నియమాలు ప్రకారం వర్తిస్తాయి.
పాల్గొనే బ్యాంకులు:
☞బ్యాంక్ ఆఫ్ బరోడా
☞బ్యాంక్ ఆఫ్ ఇండియా
☞బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర
☞కెనరా బ్యాంక్
☞సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
☞ఇండియన్ బ్యాంక్
☞ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్
☞పంజాబ్ నేషనల్ బ్యాంక్
☞పంజాబ్ & సింధ్ బ్యాంక్
☞యూసీవో బ్యాంక్
☞యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్ ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.850. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.175.
ఎంపిక విధానం:
☞ప్రిలిమినరీ పరీక్ష (ఆబ్జెక్టివ్)
☞మెయిన్స్ పరీక్ష (ఆబ్జెక్టివ్ + డిస్క్రిప్టివ్)
☞వ్యక్తిత్వ పరీక్ష
☞ఇంటర్వ్యూ
☞ఫైనల్ సెలెక్షన్ – మెయిన్స్ (80%) + ఇంటర్వ్యూకు (20%) ఆధారంగా ఉంటుంది.
దరఖాస్తు విధానం:
☞IBPS వెబ్‌సైట్‌ను సందర్శించండి.
☞“CRP PO/MT-XV” పై క్లిక్ చేయండి.
☞ప్రాథమిక వివరాలతో నమోదు చేయండి.
☞ఫోటో, సంతకం, వేలిముద్ర, హస్తప్రతిగా రాసిన డిక్లరేషన్, సర్టిఫికెట్లు అప్‌లోడ్ చేయాలి.
☞ఫీజు ఆన్‌లైన్‌లో చెల్లించాలి.
☞దరఖాస్తును సమర్పించి ప్రింటౌట్ తీసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు:
☞ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 01 జూలై 2025.
☞ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 21 జూలై 2025.
☞ప్రిలిమినరీ పరీక్ష: ఆగస్టు 2025.
☞మెయిన్స్ పరీక్ష: అక్టోబర్ 2025.
☞ఇంటర్వ్యూలు: డిసెంబర్ 2025 – జనవరి 2026.
☞తాత్కాలిక అలాట్మెంట్: జనవరి – ఫిబ్రవరి 2026.
ముఖ్యమైన విషయాలు
☞అర్హత కలిగి ఉన్నవారే దరఖాస్తు చేయాలి.
☞మొబైల్ నంబర్, ఇమెయిల్ ఐడీ చివరి సెలెక్షన్ వరకు యాక్టివ్‌లో ఉండాలి.
☞స్కాన్ చేసిన డాక్యుమెంట్లు ముందే సిద్ధం చేసుకోవాలి.
☞అడ్మిట్ కార్డులు పోస్టు ద్వారా పంపరు.
☞ఆధార్ ఆధారిత ధృవీకరణ ఉంటుంది.
☞చివరి తేదీకి ముందు దరఖాస్తు పూర్తి చేయాలి.
IBPS PO/MT Recruitment Notification
Thanks for reading IBPS PO/MT: IBPS PO Notification with 5,208 posts
No comments:
Post a Comment