IBPS: 1007 Specialist Officers posts in IBPS
IBPS: ఐబీపీఎస్‌లో 1007 స్పెషలిస్ట్ ఆఫీసర్స్ పోస్టులు
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (IBPS) 2026–27 రిక్రూట్మెంట్ చక్రం కోసం పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్స్ (Scale-I) నియామకానికి సంబంధించి CRP SPL-XV నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆన్‌లైన్ ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షలు, ఇంటర్వ్యూకు అర్హత కలిగిన అభ్యర్థులు జూలై 1 నుంచి 21, 2025 వరకు IBPS అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేయవచ్చు.
పోస్టు పేరు - ఖాళీలు
☞ ఐబీపీఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్: 1007
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఎస్సీ, బీటెక్, ఎల్‌ఎల్‌బీ, ఎంఏ, ఎంఆర్క్, ఎంఈ/ఎంటెక్, ఎంబీఏ/పీజీడీఎం, పీజీ డిప్లొమా, పీజీడీబీఎం, పీజీడీబీఏలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థులు 2025 జూలై 21 నాటికి విద్యార్హతలన్నీ పూర్తిచేసి ఉండాలి. ఒక అభ్యర్థి ఒకే పోస్టుకు మాత్రమే దరఖాస్తు చేయాలి.
గరిష్ఠ వయోపరిమితి: 2025 జులై 1వ తేదీ నాటికి 20 - 30 ఏళ్లు ఉండాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
వేతనం: నెలకు రూ.36,000 - రూ.63,840. డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ఇతర అలవెన్సెస్‌తో ఉంటుంది.
ఎంపిక విధానం:
☞ప్రిలిమినరీ ఆన్‌లైన్ పరీక్ష: ఆగస్టు 2025.
☞మెయిన్ ఆన్‌లైన్ పరీక్ష: నవంబర్ 2025.
ఇంటర్వ్యూ: డిసెంబర్ 2025 – జనవరి 2026.
☞మెయిన్ పరీక్షకు 80% + ఇంటర్వ్యూకు 20% వెయిటేజ్ ఉంటుంది.
దరఖాస్తు విధానం:
☞అధికారిక వెబ్‌సైట్ www.ibps.in కు వెళ్లి “CRP Specialist Officers → Apply Online for CRP SPL-XV” ను ఎంచుకోండి.
☞రిజిస్ట్రేషన్ చేయండి (ఈమెయిల్ / మొబైల్‌తో).
☞ఫోటో, సిగ్నేచర్, వేలిముద్ర, హ్యాండ్ రాత డిక్లరేషన్ అప్‌లోడ్ చేయండి.
☞అప్లికేషన్ ఫీజు చెల్లించి ఫారం సబ్మిట్ చేయండి.
☞సబ్మిట్ చేసిన దరఖాస్తును ప్రింట్ తీసుకోండి.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.850. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.175.
పరీక్ష కేంద్రాలు:
దేశవ్యాప్తంగా ఐబీపీఎస్ నిర్ణయించిన కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్ష కేంద్ర మార్పు కోసం అభ్యర్థుల అభ్యర్థనలు పరిగణనలోకి తీసుకోరు.
ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 01 జూలై 2025.
ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 21 జూలై 2025.
ప్రిలిమినరీ పరీక్ష: ఆగస్టు 2025.
మెయిన్ పరీక్ష: నవంబర్ 2025.
ఇంటర్వ్యూలు: డిసెంబర్ 2025 – జనవరి 2026.
ముఖ్యమైన విషయాలు:
☞ఒకే పోస్టుకు మాత్రమే దరఖాస్తు చేయాలి.
☞21 జులై 2025 నాటికి అన్ని అర్హతలు ఉండాలి.
☞ఆధార్ నంబర్, బ్యాంకింగ్ క్రెడిట్ హిస్టరీ తప్పనిసరి.
☞బయోమెట్రిక్, ఆధార్ ఆన్‌లైన్ వెరిఫికేషన్ జరుగుతుంది.
☞ పూర్తి సమాచారం www.ibps.in లో ఉంటుంది.
IBPS SO Recruitment 2025 Notification
Thanks for reading IBPS: 1007 Specialist Officers posts in IBPS
No comments:
Post a Comment