Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Friday, November 8, 2019

Betel leaves-uses- ఆయుర్వేదం నందు తమలపాకు ఉపయోగాలు .





Betel leaves-uses- ఆయుర్వేదం నందు తమలపాకు ఉపయోగాలు .

Betel leaves-uses- ఆయుర్వేదం నందు తమలపాకు ఉపయోగాలు .

ఆయుర్వేదం నందు తమలపాకు ఉపయోగాలు  - 

 * తమలపాకు కొంచెం చేదు , కారం రుచి కలిగియుండును.

 * బెంగాల్ నుంచి వచ్చే తమలపాకు కంటే దక్షిణ భారతదేశం నందు దొరుకు దళసరిగా కొంచం నలుపురంగు కలిగినవి వైద్యం నందు ఎక్కువ ఉపయోగంగా ఉంటాయి .

 * తమలపాకు ఉపయోగించడం వలన నోటిజిగట, దుర్గంధం , శ్లేష్మము , వాతము , గుండెల్లో భారము , అజీర్ణం పొగొట్టును.

 * ఆకలి తక్కువ ఉన్నవారు దీనిని ఉపయోగించుట వలన ఆకలి పెరుగును.

 * దేహములో ఉండే దుష్ట పదార్ధాలని తీసివేయను .

 * గొంతుక , రొమ్ముని శుభ్రపరచును.

 * జ్వరం , దగ్గు, శ్లేష్మము ఉన్న సమయంలో తమలపాకు వెచ్చచేసి రసము తీసి సేవించిన ఉపయుక్తముగా ఉండును. మోతాదు 15ml లేదా 3 టీస్పూన్స్ రెండుపూటలా వాడవలెను .

 * కొంతమందికి మెదడు గట్టిపడటం జరిగి ఉత్సాహముగా ఉండరు. వారికి పైన చెప్పిన మోతాదులో రెండుపూటలా ఇవ్వడం వలన వారిలో అద్భుత ఫలితాలు కనిపిస్తాయి .

 * శిశువులకు విరేచనం కానప్పుడు తమలపాకు తొడిమను ఆముదములో ముంచి బిడ్డల మలద్వారం ద్వారా లొపలికి చొప్పించిన విరేచనం అగును.

 * గొంతులో పుండు వచ్చినపుడు తమలపాకుకి ఆవనూనె రాసి వెచ్చచేసి గొంతుక మీద వేసి కట్టిన గొంతుక పుండు మానును.

 *  హిస్టీరియా వ్యాధిగ్రస్తులకు దీని రసంలో కొంచం కస్తూరి కలిపి ఇచ్చిన నయం అగును.

 * మూత్రం బంధించినప్పుడు తమలపాకుల కు ఆముదం రాసి వెచ్చచేసి పొట్టపైన వేసినచో కేవలం 10 నిమిషాలలో మూత్రం బయటకి వచ్చును . ఇది నేను ప్రయోగించాను.

 *  చిన్న పిల్లలకు దగ్గు , జలుబు బాగాచేసి గాలిపీల్చుకోవడం ఇబ్బంది అవుతున్నప్పుడు పైన చెప్పిన విధంగా ఆకులకు ఆముదం రాసి వెచ్చచేసి రొమ్ముపైన వేయాలి .

 *  పక్కనొప్పి , లివర్ గట్టిపడటం వంటి సమస్యలు ఉన్నప్పుడు ఆకులకు ఆముదం రాసి వెచ్చచేసి కుడిపక్కన చంక క్రింద , లివరు భాగంలో వేయుచున్న ఆ సమస్యలు తీరును.

 * స్త్రీల చన్నులపై వేడిచేసి వేసిన పాలు హరించును . గవదలపైన  వేసిన టాన్సిల్స్ హరించును .

 గమనిక  -

 * ఎండినవి , పురుగు పట్టినవి వైద్యానికి వాడరాదు.

 * స్త్రీలు ఎక్కువ ఉపయోగించరాదు. గర్భాశయ సమస్యలు వస్తాయి.

 * సున్నం వేసిన ఆకులు వైద్యానికి పనికిరావు.

Thanks for reading Betel leaves-uses- ఆయుర్వేదం నందు తమలపాకు ఉపయోగాలు .

No comments:

Post a Comment