Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Monday, November 9, 2020

AP government corona regulations on school buses and autos


స్కూల్ బస్సులు , ఆటోలకు కరోనా నిబంధనలు విధించిన ఏపీ సర్కార్


ఏపీలో స్కూళ్లు ప్రారంభమయ్యాయి. కరోనా వ్యాప్తి ఉన్న సమయంలో ఈ నిర్ణయం సాహసోపేతమే. స్కూళ్లు పున: ప్రారంభం చేసిన అనంతరం పలువురు టీచర్లు, విద్యార్థులు కరోనా బారినపడ్డారు. ప్రభుత్వం కఠిన చర్యలు తీసకుంటున్నప్పటికీ స్కూళ్లలో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. ఈ క్రమంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం స్కూళ్ల యాజమాన్యాలకు సూచిస్తోంది. విద్యార్థులు కరోనా వైరస్ బారిన పడకుండా ఉండేందుకు జగన్ సర్కార్ ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తోంది. పాఠశాల బస్సులు, ఆటోల్లో పిల్లలను తరలించే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన నిబంధనలపై మార్గదర్శకాలు జారీ చేసింది. ఆ పాఠశాల బస్సులు, ఆటోలకు కరోనా నిబంధనలు విధించింది ప్రభుత్వం.పిల్లలు స్కూళ్లకు నడిచి లేదా బైక్​పై వచ్చేలా పాఠశాల యాజమాన్యాలు ప్రోత్సహించాలని ప్రభుత్వం సూచించింది. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోనున్నట్లు ఉన్నతాధికారులు హెచ్చరించారు.


బస్సుల్లో పాటించాల్సిన నిబంధనలు :

ముందుగా విద్యార్థులు ఎక్కక ముందు, ఇళ్ల వద్ద వదిలి పెట్టిన అనంతరం పాఠశాల బస్సులను శానిటైజ్ చేయాలి

సీట్ల వరుసకు ఒక విద్యార్థిని మాత్రమే కూర్చోబెట్టాలి

పుస్తకాలు, లగేజీని శానిటైజేషన్ చేశాక నిర్ణీత ప్రదేశంలో ఉంచాలి

విద్యార్థులు బస్సు ఎక్కే ముందు థర్మల్ స్క్రీనింగ్ తప్పక నిర్వహించాలి

బస్సుల్లో ఇద్దరు విద్యార్థుల మధ్య 6 అడుగుల భౌతిక దూరం ఉండాలి

విద్యార్థులు, డ్రైవర్, అటెండర్ మాస్క్​లు, ఫేస్ షీల్డ్​లను తప్పక ధరించాలి

బస్సుల్లో అధిక సామర్థ్యం కలిగిన గాలి ఫిల్టర్లను ఏర్పాటు చేయాలి

బస్సుల కిటికీలను తెరచి ఉంచాలి… ఏసీలను వినియోగించకూడదు

కరోనా నివారణపై అవగాహన కల్పించే పోస్టర్లను బస్సు లోపల, బయట ప్రదర్శించాలి

డ్రైవర్​ గ్లాస్​తో క్యాబిన్​ ఏర్పాటు చేసుకోవాలి

బస్సుల్లో అటెండర్​ తప్పనిసరిగా ఉండాలి

పిల్లలు బస్సు ఎక్కేందుకు ముందుగానే తప్పనిసరిగా చేతులు శుభ్రపరచుకునేలా చర్యలు తీసుకోవాలి

ఆటో రిక్షాలకు నిబంధనలు ఇవి :


పిల్లలను తీసుకుపోయే ముందు ఆటోను తప్పని సరిగా సోడియం హైపో క్లోరైడ్​తో శానిటైజ్ చేయాలిః

ఆటోల్లో పిల్లలను ఎదురెదురుగా కూర్చోబెట్టకూడదు.

ఆటో డ్రైవర్ తప్పనిసరిగా మాస్క్ ధరించాలి

మాస్క్​లు ధరించిన పిల్లలను మాత్రమే ఆటోల్లోకి అనుమతించాలి

ఆటోలో శానిటైజర్​ తప్పక అందుబాటులో ఉంచాలి

ఆటోలో ముగ్గురు విద్యార్థులు మాత్రమే ప్రయాణానికి అనుమతి


Thanks for reading AP government corona regulations on school buses and autos

No comments:

Post a Comment