Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Monday, January 4, 2021

Sankranthi Holidays from 12


 12 నుంచి సంక్రాంతి సెలవులు



♦11న అమ్మఒడి కార్యక్రమం

పాఠశాలలకు ఈనెల 12 నుంచి 17వ తేదీ వరకు సంక్రాంతి సెలవులను ఇస్తున్నట్లు రాష్ట్ర విద్య పరిశోధన, శిక్షణ మండలి సంచాలకుడు ప్రతాప్‌రెడ్డి వెల్లడించారు. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులతో అకడమిక్‌ అంశాలపై సోమవారం యూట్యూబ్‌ ఛానల్‌ లైవ్‌ను ఆయన నిర్వహించారు. ‘9న రెండో శనివారం పాఠశాలలకు సెలవు. 11న అమ్మఒడి కార్యక్రమం ఉన్నందున మధ్యాహ్నం వరకు పాఠశాలలు నడుస్తాయి. 12 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు. 18న బడులు తెరుచుకుంటాయి. మొదట ప్రకటించిన షెడ్యూలు ప్రకారం 7, 8 తరగతులకు ఈ నెల 23 నుంచి ఫార్మేటివ్‌ పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉండగా వాటిని ఫిబ్రవరికి వాయిదా వేస్తున్నాం. వచ్చే నెల 8, 9, 10 తేదీల్లో పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. 9, 10 తరగతులకు ఈనెల 6 నుంచి ఫార్మేటివ్‌ పరీక్షలు జరుగుతాయి’ అని ఆయన వివరించారు.


♦సెలవుల తర్వాత ఇంటర్‌ తరగతులు

ఇంటర్‌ మొదటి ఏడాది తరగతులను సంక్రాంతి సెలవుల తర్వాత ప్రారంభించనున్నారు. రెండో ఏడాది విద్యార్థులకు నవంబరు 2నుంచి ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ తరగతులు సాగుతుండగా.. పండగ సెలవుల అనంతరం నేరుగా తరగతులు నిర్వహించేందుకు ఇంటర్‌ విద్యా మండలి చర్యలు చేపట్టింది. ఆన్‌లైన్‌ ప్రవేశాలపై న్యాయస్థానం తీర్పు నేపథ్యంలో ఈ వారంలో ఆఫ్‌లైన్‌ ప్రవేశాలకు ఇంటర్‌ విద్యామండలి ప్రకటన జారీ చేయనుంది. గతంలోగానే సీట్లను భర్తీ చేసుకునేందుకు కళాశాలలకు అనుమతి ఇవ్వనుంది. ఇంటర్‌ రెండో ఏడాది విద్యార్థులకు ఏప్రిల్‌ మొదటి వారంలో పరీక్షలు నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. ప్రవేశాల్లో జాప్యం జరిగినందున మొదటి ఏడాది విద్యార్థులకు మే నెల మొదటి వారంలో పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. కొవిడ్‌ కారణంగా ప్రయోగ పరీక్షల నిర్వహణ కష్టమని భావిస్తున్న ఇంటర్‌ విద్యా మండలి ప్రాజెక్టు వర్క్స్‌ను ప్రవేశపెట్టాలని భావిస్తోంది. దీనిపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది.

Thanks for reading Sankranthi Holidays from 12

No comments:

Post a Comment