Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Tuesday, March 30, 2021

The new rules of the Income Tax Department will come into effect from April 1.


 ఆదాయపన్ను శాఖ కొత్త నిబంధనలు ఏప్రిల్​ 1 నుంచి అమలులోకి రానున్నాయి.

వచ్చే ఆర్థిక సంవత్సరానికి గాను ఆదాయపన్ను శాఖ కొత్త నిబంధనలు తీసుకువచ్చింది. ఈ షరతులు ఏప్రిల్​ 1 నుంచి అమలులోకి రానున్నాయి. పన్నుచెల్లింపుదారులకు వర్తించే ఆ మార్పులు ఏంటో తెలుసుకుందాం.

★మార్చి 31తో ఆర్థిక సంవత్సరం ముగియనుంది. వ్యక్తిగత ఆదాయ పన్ను రేట్లలో ఎలాంటి మార్పుల లేవని తాజాగా ప్రవేశ పెట్టిన బడ్జెట్​ ఇప్పటికే స్పష్టం చేసింది. అయితే వీటికి సంబంధించి కొన్ని కీలక మార్పులను సూచించింది ఆర్థిక శాఖ. కొత్త సంవత్సరంలో(ఏప్రిల్ 1 నుంచి) వర్తించే మార్పులు ఏంటో తెలుసుకుందాం.

★ఆదాయపు పన్ను విభాగం 1 ఏప్రిల్​ 2021 నుంచి ఐటీఆర్‌లలో నింపాల్సిన సెక్షన్ల జాబితాను మరింత పెంచింది. దీంతో పన్ను చెల్లింపుదారులు తన జీతం, టీడీఎస్​, వడ్డీ, డివిడెండ్​ మీద వచ్చే ఆదాయం, లిస్టెడ్​ సెక్యురిటీల నుంచి మూలధన లాభాలను కచ్చితంగా చూపించాల్సి ఉంటుంది.

★వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ. 2.5 లక్షలకు పైగా ఈపీఎఫ్​ అకౌంట్​లో జమ చేస్తే వారు పన్ను పరిధిలోకి వస్తారని కేంద్ర ఆర్థిక శాఖ నిర్మలా సీతారామన్ 2021-22గాను ప్రతిపాదించిన బడ్జెట్​లో ప్రకటించారు.

★75 ఏళ్లు పైబడిన వారికి ఐటీఆర్ దాఖలు నుంచి మినహాయింపు లభించనుంది. అయితే వారు పెన్షన్​, వడ్డీ ఆదాయాన్ని ఒకే బ్యాంక్​ నుంచి పొందాల్సి ఉంటుంది. లేకపోతే వారికి మినహాయింపు లభించకపోవచ్చు. అంతేగాక మరే ఇతర ఆదాయ మార్గాలు ఉన్నాకానీ వారు అర్హులు కాదు.

★2021 ఏప్రిల్​ 1 నుంచి టీడీఎస్​ విధానంలోనూ మరికొన్ని మార్పులు రానున్నాయి. కొత్తగా చేర్చిన 206 ఏబీ, 206సీసీఏతో... ఐటీఆర్​ దాఖలు చేయని వారు రెండేళ్లలో రూ.50వేలు అంత కంటే ఎక్కువ టీడీఎస్​ లేదా టీసీఎస్​ కలిగి ఉంటే వారు కనీసం 5% చెల్లించాల్సి ఉంటుంది.

★ఎల్‌టీసీ నగదు ఓచర్ పథకం: ఎల్​టీసీ స్థానంలో ఎల్‌టీసీ నగదు ఓచర్ పథకాన్ని తీసుకువచ్చింది ప్రభుత్వం. దీని కింద ఉద్యోగులు వారు కొనుగోలు చేసి వస్తువులను/సేవలకు మినహాయింపులు ఉంటాయి. అయితే ఇది ఈ నెల 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంది. ఈ పథకం కింద లబ్ధి పొందటానికి నిర్ణీత తేదీ డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది.

★పాత పన్ను విధానానికి బదులుగా కొత్త పన్ను విధానాన్ని ఎంపిక చేసుకునే సౌకర్యం రానుంది. కొత్త విధానాన్ని కేంద్రం గతేడాది నుంచి అమలు చేస్తోంది. అయితే ఏప్రిల్​ 1 నుంచి పన్ను చెల్లింపుదారులు వారికి ఇష్టం వచ్చిన పన్ను విధానాన్ని ఎంపిక చేసుకోవచ్చు

Thanks for reading The new rules of the Income Tax Department will come into effect from April 1.

No comments:

Post a Comment