Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Monday, May 24, 2021

National Nutrition Institute guidelines on food


 ICMR: ఆహారం విషయంలో జాతీయ పోషకాహార సంస్థ సూచనలు.

 కరోనా కష్టకాలం ఇది. మహమ్మారి విలయతాండవం చేస్తున్న వేళ.. దేనిని తాకాలన్నా భయం.. తీసుకోవాలన్నా అనుమానం. అలా అని తాకకుండా ఉండలేం.. తీసుకోకుండా ఆగలేం. అలాంటిది ఆహారం వదిలేయగలమా..? ఒక్కోసారి కూరగాయలు తెస్తున్నామా.. కరోనాను మోసుకొస్తున్నామా అనే కంగారు నిలువనీయని పరిస్థితి. అయితే ఆహారం ద్వారా కరోనా వస్తున్న దాఖలాలు లేకపోవడంతో కాస్త ఉపశమనంగా ఉన్నా.. వాటిని తీసుకురావడంలో జరుగుతున్న పొరపాట్లకు మూల్యం చెల్లించాల్సి వస్తోంది. ఆహార పొట్లాలపై కరోనా వైరస్‌ వ్యాపించి ఉంటే.. కూరగాయలు అమ్ముతున్న వ్యక్తికి కరోనా ఉంటే.. ఇంటికి ఆహార ప్యాక్‌లను తీసుకువస్తున్న వ్యక్తి ఆ మహమ్మారి బారిన పడితే.. వాటిని అందుకున్న వారికి కరోనా ముప్పు పొంచి ఉంటుంది. ఇలాంటి తరుణంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనం భద్రమో జాతీయ పోషకాహార సంస్థ సూచిస్తోంది.


ఎలా శుభ్రం చేయాలి.

* నల్లాద్వారా పారుతున్న నీటితో కూరగాయలు, పండ్లను కడగాలి లేదా 500 పీపీఎం డ్రాప్‌ ఉంచండి..గోరు వెచ్చని నీటిలో క్లోరిన్‌, వాటిని ముంచి కడగాలి.


* క్రిమిసంహారక మందులు, శానిటైజర్లు నేరుగా కూరగాయల మీద చల్లవద్ధు అలా చల్లితే కూరగాయలు, పండ్లద్వారా మరింత హాని కలిగించేవారం అవుతాం.


* శుభ్రంగా కడిగిన కూరగాయలను, పండ్లను ఫ్రిజ్‌లో భద్రపరచాలి. అలాగే మాంసం కూడా నల్లా ద్వారా వచ్చే నీటిలో కడగాలి. 

● పాలు, పెరుగు ప్యాకెట్లను శుభ్రంగా కడిగి.. వాటిని పొడి వస్త్రంతో తుడిచి.. తడి ఆరాక వినియోగించడంతో పాటు.. ఫ్రిజ్‌లో భద్రపరచాలి. 

● దెబ్బతిన్న కోడి గుడ్లను తీసుకురావద్ధు ఫ్రిజ్‌లో అలాంటివి అస్సలే ఉంచరాదు.


ఆహార పదార్థాలను ఇంటికే తెప్పించుకుంటే..


* ఆహారం ప్యాకెట్లను శానిటైజ్‌ చేయాలి. అయితే ఆహారంపై పడకుండా చూసుకోవాలి. పై కవర్లను తీసి చెత్తకుండీలో వేయాలి. తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కొని.. ఎక్కడా చేతులతో తాకకుండా.. గరిటలు, చెంచాలతో అందరికీ వడ్డించాలి. వేడి పదార్థాలు వేడిగా ఉన్నప్పుడు.. చల్లటివి చల్లగా ఉన్నప్పుడే తీసుకోవాలి.


బయట ఏవైనా కొనేటప్పుడు..

* ఎప్పుడూ తాజా కూరగాయలు మాత్రమే కొనండి. వాడిపోయినవి, దెబ్బతిన్నవి కొనొద్ధు


* మీరు సొంతంగా చేతి సంచిని తీసుకెళ్లండి. మీకు కావాల్సిన కూరగాయలపైనే చేయి వేయండి.


* మీరు తీసుకున్న కూరగాయలు మీ శరీరానికి, దుస్తులకు తగలకుండా జాగ్రత్తగా సంచిలో వేసి తీసుకురావాలి.


* మాంసం కొంటే.. అప్పుడే తాజాగా కోసిన మాంసాన్నే కొనండి. శుభ్రతను పాటిస్తూ ఫ్రిజ్‌లో భద్రపరిచినవి తీసుకోవాలంటే.. అతి చల్లగా ఉండేలా తీసుకుని మనం వండేవరకూ భద్రత పాటించండి.


మీరు మార్కెట్‌ నుంచి ఇంటికి వచ్చాక మీ చేతులు సబ్బుతో బాగా శుభ్రం చేసుకోవాలి. 40 నుంచి 60 క్షణాలు సబ్బుతో బాగా రుద్దుకోవాలి.


వండేటప్పుడు..

* కూరగాయలు కోసే కత్తులతో వాటినే కోయాలి. అన్నిటినీ తరగడానికి ఒక కత్తెర వాడకూడదు.


* వేటికవే శుభ్రం చేయాలి. శాకాహారం, మాంసాహారం ఇలా అన్నీ శుభ్రం చేశాకే చేతులు కడుక్కుంటామనుకోవడం పొరపాటు.


* ఇగురు కూరలు, కూరలు, పప్పులు, అన్నం ఇలా ఫ్రిజ్‌లో ఉంచాలంటే.. వేటికవి గాలి లోనకు చొరబడని విధంగా మూతలు పెట్టి 4 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండేలా ఫ్రిజ్‌ను చూసుకోవాలి.


* వండి ఫ్రిజ్‌లో భద్రపరచిన కూరలు, పప్పులు ఫ్రిజ్‌లోంచి తీసి వెంటనే వేడి చేసుకోవాలి.. సాధారణంగా బయట కాస్త సమయం ఉంచి వేడి చేయాలనుకోవడం మంచిది కాదు.


* చేతి వేళ్లకు ఉన్న గోళ్లను కత్తిరించుకోవాలి.

Thanks for reading National Nutrition Institute guidelines on food

No comments:

Post a Comment