Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Monday, May 3, 2021

These are the best insurance policies that apply to Corona!


 కరోనాకూ వర్తించే ఉత్తమ బీమా పాలసీలు ఇవే !

These are the best insurance policies that apply to Corona!


దేశంలో కరోనా రెండో దశ విజృంభిస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అనారోగ్యం పాలైతే ఖర్చులు భారీగా ఉంటాయి. ఆర్థిక స్థితి విచ్ఛిన్నం అవుతుంది. మరి ప్రస్తుతం ఎలాంటి ఆరోగ్య బీమా తీసుకోవడం ద్వారా ధీమాగా ఉండొచ్చు? కుటుంబం మొత్తానికి వర్తించే పాలసీలు ఏమున్నాయి? అనే వివరాలతో మీకోసం  అందిస్తున్న ఓ ప్రత్యేక కథనం.


దేశవ్యాప్తంగా రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరుగుతోంది. కొవిడ్ రెండో దశ ఎప్పటికి ముగుస్తుందో ఎవరికీ స్పష్టత లేదు. మరో విడత కూడా ఉండే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. కరోనా వల్ల ఇప్పటికే చాలా కుటుంబాలు ఆర్థికంగా చిక్కుల్లో పడ్డాయి. అలాంటి వారికి కరోనా సోకితే ఇక వైద్య ఖర్చులతో జేబుకు చిల్లు పడటం ఖాయం.


సాధారణ అనారోగ్యానికే ప్రస్తుతం వైద్య ఖర్చులు భారీగా ఉంటున్నాయి. అలాంటిది కరోనా చికిత్సకు అయ్యే ఖర్చులు, అందులోనూ ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్యం అంటే.. ఇక ఎంత ఖర్చవుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.కరోనా తీవ్ర రూపం దాల్చుతున్న ప్రస్తుత సమయంలో చాలా మందికి తమ ఆరోగ్య పాలసీలు.. కొవిడ్​కు కవరేజీ ఇస్తాయా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మీ బీమా మౌలికమైన సమగ్ర ఆరోగ్య బీమా ఉన్నట్లయితే కొవిడ్ సంబంధిత కవరేజీ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

సమగ్ర బీమా లేని వారికి.. కరోనాకు వర్తించేలా అందుబాటులో ఉన్న ఆరోగ్య బీమాలు ఏవి? వాటి ప్రీమియం ఎంత ఉంటుంది? ఎవరు తీసుకోవాలి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.

భారత బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ(ఐఆర్​డీఏఐ) గత సంవత్సరం ప్రామాణిక కొవిడ్ పాలసీలను ప్రవేశపెట్టింది. వీటిని ఆరోగ్య బీమా, జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలు అందిస్తున్నాయి. కరోనా కవచ్, కరోనా రక్షక్ పేరిట అందుబాటులోకి వచ్చిన ఈ ప్రామాణిక బీమాలు కొవిడ్​ చికిత్సకు సంబంధించిన అన్ని రకాల ఖర్చులను భరిస్తాయి. ఏ కంపెనీ నుంచి తీసుకున్నా ప్రయోజనాలు మాత్రం ఒకేలా ఉంటాయి.


కరోనా కవచ్ పాలసీ

◆ ఇది వ్యక్తిగతంగా లేదా కుటుంబం మొత్తానికి కలిపి తీసుకునే బీమా. ఇందులో చికిత్స ఖర్చుకు అనుగుణంగా క్లెయిమ్ చేసుకోవచ్చు. తొలుత వీటిని 2021 మార్చి 31 వరకే ఇచ్చేందుకు ఐఆర్​డీఏఐ అనుమతించింది. అయితే ఇటీవల 2021 సెప్టెంబర్ 31 వరకు అందించేలా నిబంధనలు సడలించింది ఐఆర్​డీఏఐ.

◆ఈ పాలసీలో కరోనాకు హాస్పిటలైజేషన్, ఐసీయూ ఛార్జీలు, హోం కేర్ చికిత్స, అంబులెన్స్ ఛార్జీలు, పీపీఈ కిట్లు, మెడికల్ గ్లవ్స్, మాస్కులు, డాక్టర్ ఫీజులు, ఆయూష్ చికిత్స అన్నింటికీ కవరేజీ ఉంటుంది.

◆రూ.50వేల నుంచి రూ.5 లక్షల వరకు బీమా తీసుకోవచ్చు. రూ.50 వేలు గ్యాప్​తో కవరేజీని ఎంచుకోవచ్చు.

◆3.5 నెలలు, 6.5 నెలలు, 9.5 నెలల వ్యవధితో పాలసీ తీసుకోవచ్చు. 18 ఏళ్ల నుంచి 65 ఏళ్ల వారు ఈ పాలసీకి అర్హులు.

◆ఒకవేళ పిల్లలు ఉన్నట్లయితే ఫ్యామిలీ ఫ్లోటర్ ఆఫ్షన్ తీసుకోవచ్చు.

◆సాధారణ పాలసీలతో పోల్చితే వెయిటింగ్ పీరియడ్ తక్కువగా ఉంటుంది. ఈ పాలసీకి 15 రోజులు వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. రెన్యూవల్ చేసుకునే సమయంలో వెయిటింగ్ పీరియడ్ అవసరం లేదు.

◆రూ. వేయి నుంచి రూ. 3వేల మధ్య ఈ పాలసీకి ప్రీమియం ఉంటుంది. సాధారణ ఆరోగ్య బీమాలతో పోల్చితే ఇది చాలా తక్కువ.


ఎవరు తీసుకోవాలి?

ఎలాంటి ఆరోగ్య బీమా లేని వారు దీనిని తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కుటుంబానికి సరిపడా మొత్తం కవరేజీతో సమగ్ర ఆరోగ్య బీమా ఉన్నట్లయితే పాలసీ అవసరం లేదని చెబుతున్నారు. సరిపడా సమగ్ర బీమా లేకున్నా ఈ పాలసీ తీసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.


కరోనా రక్షక్ పాలసీ

ఈ బీమాను వ్యక్తిగతంగా తీసుకోవాల్సి ఉంటుంది. కుటుంబం మొత్తం తీసుకోవడానికి వీలులేదు. 72 గంటలు ఆస్పత్రిలో చికిత్స పొందినట్లయితే ఈ బీమా క్లెయిమ్ చేసుకోవచ్చు. కరోనా కవచ్​లానే దీనిలో కూడా అన్ని ఖర్చులకు కవరేజీ ఉంటుంది. 18-65 ఏళ్ల వారు ఈ పాలసీని తీసుకోవచ్చు.రూ.50వేల నుంచి రూ. 2.5 లక్షల మధ్య బీమా కవరేజీని తీసుకోవచ్చు. ఒక సారి కరోనా పాజిటివ్ అని తెలితే .. తీసుకున్న బీమా మొత్తం ఒకేసారి అందుతుంది.


ఎవరికి ఇది సరిపోతుంది?

ఇప్పటికే ఆరోగ్య బీమా ఉండి.. బీమా మొత్తం సరిపోదు అనిపించినట్లయితే దీన్ని తీసుకోవచ్చు. అంతేకాకుండా కుటుంబం మొత్తానికి ఒకేసారి చికిత్స చేయిస్తే బీమా మొత్తం సరిపోకపోవచ్చు. అలాంటి సమయంలో కూడా దీన్ని తీసుకోవచ్చు.


ఆరోగ్య బీమా సరిపోతుందా?

ఆరోగ్య బీమాలో కూడా కొవిడ్​కు కవరేజీ ఉంటుంది. ఆరోగ్య బీమా ఉన్న ప్రతి ఒక్కరికి కొవిడ్ చికిత్సకు కూడా కవరేజీ ఇవ్వాలని ఐఆర్​డీఏఐ గతేడాది బీమా సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. ఆరోగ్య బీమా సాధారణంగా హాస్పిటలైజేషన్ ఛార్జీలను అందిస్తుంది. అయితే ఇందులో క్రిటికల్ వ్యాధులకు బీమా వర్తించదు. ఐసీయూ ఛార్జీలు, అంబులెన్స్ తదితరాలకు కూడా పరిమితులు ఉండే అవకాశం ఉంది.ఆరోగ్య బీమా ఉన్నట్లయితే కొవిడ్ సంబంధించిన కవరేజీ గురించి బీమా సంస్థలను సంప్రదించటం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. కరోనా నయమైనప్పటికీ దీర్ఘకాలంలో దాని ప్రభావం మానవ శరీరం పైన ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. కాబట్టి సమగ్రమైన ఆరోగ్య బీమా తప్పకుండా తీసుకోవాలని వారు సలహా ఇస్తున్నారు.



వివిధ కంపెనీల్లో క్లెయిమ్​ రేషియో..


కేర్ హెల్త్ ఇన్సూరెన్స్

కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ (రెలిగేర్) అందిస్తున్న కరోనా కవచ్ ప్లాన్ ఇది. దీనిలో క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో 92 శాతంగా ఉంది. 8200 నెట్​వర్క్ ఆసుపత్రులు ఉన్నాయి.


స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్

9900 నెట్​వర్క్ ఆస్పత్రులు స్టార్ హెల్త్​కు ఉన్నాయి. క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో 79 శాతంగా ఉంది.


ఎడెల్విస్ హెల్త్ ఇన్సూరెన్స్

 కరోనా కవచ్ పాలసీకి క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో 85 శాతం ఉంది. 3 వేల నెట్​వర్క్ ఆస్పత్రులు ఉన్నాయి.


న్యూ ఇండియా ఆస్యూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్

కరోనా కవచ్ పాలసీకి క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో 92 శాతం ఉంది. అయితే నెట్​వర్క్ ఆస్పత్రులు కేవలం 1500 మాత్రమే ఉన్నాయి.


బజాజ్ అలియాంజ్ హెల్త్ ఇన్సూరెన్స్

 కరోనా కవచ్ పాలసీకి క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో 92 శాతం ఉంది. నెట్​వర్క్ ఆస్పత్రులు కూడా 6500 ఉన్నాయి.


Complete Details of SBI Corona Rakshak Policy ... Here


Thanks for reading These are the best insurance policies that apply to Corona!

No comments:

Post a Comment