Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Friday, September 30, 2022

Graduated MLC Voter Registration


  MLC Voter Registration
 Mlc ఓటరు దరఖాస్తుల స్వీకరణ

  పట్టభద్రుల నియోజకవర్గంలో ఉన్నత విద్యార్హత కలిగిన వారికి శనివారం నుంచి ఓటుహక్కు కల్పించనున్నారు.

ఇందుకోసం దరఖాస్తులను స్వీకరించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. వచ్చే ఏడాది మార్చిలో ప్రస్తుత ఎమ్మెల్సీ  పదవీకాలం ముగియనుండటంతో కొత్త ఎమ్మెల్సీని ఎన్నుకునేందుకు ఎన్నికల కమిషన్‌ శ్రీకారం చుట్టింది. గతంలో ఉన్న ఓటర్ల జాబితాను రద్దుచేసిన ఎన్నికల కమిషన్‌ కొత్తగా ఓటుహక్కును పొందేందుకు అవకాశం కల్పించింది. అందులోభాగంగా అక్టోబరు ఒకటో తేదీ నుంచి జిల్లాలోని అన్ని తహసీల్దార్‌ కార్యాలయాల్లో ఓటుహక్కు కోసం దరఖాస్తులు చేసుకునే విధంగా ఏర్పాట్లు చేసింది. గత  ఓట్లను రద్దుచేసి కొత్త ఓటుహక్కు కల్పించేందుకు ఒకవైపు అధికారుల పరంగా చర్యలు తీసుకుంటుండగా, పార్టీల వైపుల నుంచి కసరత్తు చేశారు. ఈసారి అధికార వైసీపీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీతో పాటు పలువురు మేధావులు పోటీచేసేందుకు సన్నద్ధమయ్యారు. దీంతో జిల్లావ్యాప్తంగా ఈ ఓట్ల నమోదు కోసం ఆసక్తి పెరిగింది. డిగ్రీతో పాటు తత్సమాన విద్యార్హత ఉంటే ఓటు హక్కు నమోదుకు అర్హత ఉంటుంది. 

 ఓటరుగా నమోదు కావాలంటే నవంబరు 1వతేదీ నాటికి మూడేళ్ల ముందు డిగ్రీ పాసై ఉండాలి. సంబంధిత గ్రాడ్యుయేట్‌ నియోజకవర్గంలో సాధారణ నివాసితులై ఉండటంతోపాటు ఫాం -18లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు.  అన్ని మండల తహసీల్దార్‌, ఎంపీడీఓలు, ఎంఈఓల కార్యాలయాలతోపాటు పురపాలక, నగర పంచాయతీల్లో కార్యాలయాల్లో కూడా ఓటుహక్కు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

నేడు ఓటరు నమోదు కోసం నోటీసులు జారీ చేస్తారు

నవంబరు 7వతేదీ వరకు ఓటు నమోదు కోసం

దరఖాస్తులను స్వీకరిస్తారు

నవంబరు 19న ఓటర్ల జాబితాను సిద్ధం చేస్తారు

నవంబరు 23న ముసాయిదా జాబితాను ప్రకటిస్తారు

నవంబరు 23 నుంచి డిసెంబరు 9 వరకు వచ్చిన అభ్యంతరాలు, క్లైయిమ్స్‌ను స్వీకరిస్తారు

డిసెంబరు 31న తుది ఓటర్ల జాబితాను ప్రకటిస్తారు.

గ్రాడ్యుయేట్ ఓటరు నమోదు దరఖాస్తుకు కావలసినవి:    

ఫారమ్ 18

డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికెట్ (అటెస్టెడ్)

ఆధార్ కార్డు

 ఓటర్ ఐడి

పాస్ పోర్ట్ సైజ్ ఫోటో

దరఖాస్తు ఎక్కడ అందజేయాలి

మీ ఫారం- 18 ను పూరించి ఆర్డీవో / ఎమ్మార్వో కార్యాలయంలో మిగిలిన పత్రాలను జతచేసి అందజేయాలి.

Online లో ceoandhra.nic.in ద్వారా కూడా నమోదు చేసుకోవచ్చు.                  

గమనిక

గతంలో ఉన్న ఓటరు లిస్ట్ మొత్తం రద్దు చేయడం జరిగింది.

ఓటరుగా నమోదవుటకు కాల పరిమితి

2022 అక్టోబర్ 01 నుండి నవంబర్ 07 వరకు 


దరఖాస్తుకు కావలసినవి:

ఫారమ్ 18 (పట్టభద్రులు)  pdf  Here 

ఫారమ్ 19 (ఉపాధ్యాయులు)  pdf  Here 


Online FORM NO - 18  

Online FORM NO - 19

Know Your Application Status Here

AP Graduate's MLC Vorets List 2022-23 pdf download Graduate's MLC - Draft Local Authorities Rolls

పోలింగ్ స్టేషన్ ల వారీగా MLC వోటర్ జాబితా డౌన్లోడ్ 

లింక్ 👇

Check Your Name click here

VIEW THE VIDEO



Thanks for reading Graduated MLC Voter Registration

No comments:

Post a Comment