వృద్ధాప్య ఛాయలు, ముడతలు పోగొట్టుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఆహారంలో బీట్‌రూట్‌ను చేర్చుకొని చూడండి. ఇది చర్మం నిగనిగలాడటానికి, చర్మ సమస్యలు తగ్గటానికి తోడ్పడుతుంది.
వృద్ధాప్య ఛాయలు, ముడతలు పోగొట్టుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఆహారంలో బీట్‌రూట్‌ను చేర్చుకొని చూడండి. ఇది చర్మం నిగనిగలాడటానికి, చర్మ సమస్యలు తగ్గటానికి తోడ్పడుతుంది. బీట్‌రూట్‌లో చర్మం, వెంట్రుకల ఆరోగ్యానికి అవసరమైన సహజ విటమిన్లు, ప్రొటీన్లు, పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు దండిగా ఉంటాయి. దీని రసంలోని ఐరన్ దెబ్బతిన్న కణాలు పునరుత్తేజితం కావటానికి తోడ్పడుతుంది. ఫలితంగా చర్మం నిగనిగలాడుతుంది. బీట్‌రూట్‌లోని బెటలెయిన్లు ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను తగ్గిస్తాయి. డీఎన్‌ఏ దెబ్బతినకుండా కాపాడతాయి. ఇలా అన్ని కణాలు ఆరోగ్యంగా ఉండేలా చూస్తాయి. క్యారట్, దోసకాయతో కలిపి తీసుకుంటే మొటిమలు ఉద్ధృతం కాకుండానూ చూస్తుంది. మొత్తంగా చర్మం ఆరోగ్యం మెరుగవుతుంది.
Thanks for reading Try adding beetroot to your diet


No comments:
Post a Comment