ఏపీ కేబినెట్ తీసుకున్న పలు కీలక నిర్ణయాలు ఇవే..

AP Cabinet: ప్రభుత్వ పెన్షన్ విధానంపై బిల్లుకు ఏపీ కేబినెట్ ఆమోదం
సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
అమరావతి: సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వ పెన్షన్ విధానంపై బిల్లు రూపొందించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ‘ఏపీ గ్యారెంటీడ్ పెన్షన్ బిల్లు-2023’ పేరుతో కొత్త పెన్షన్ విధానం అమలుకు మంత్రివర్గంలో నిర్ణయించారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, 12వ పీఆర్సీ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
మరోవైపు రాష్ట్రంలో కొత్త మెడికల్ కళాశాలల్లో 706 పోస్టుల భర్తీకి మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. చిత్తూరు డెయిరీ ప్లాంట్‌కు 28 ఎకరాల భూమిని లీజు ప్రాతిపదికన ఇచ్చేందుకు అంగీకారం తెలిపింది. ఏపీ పౌరసరఫరాల కార్పొరేషన్ ద్వారా రూ.5వేల కోట్ల రుణ సేకరణకు కేబినెట్ అనుమతించింది. జగనన్న అమ్మ ఒడి పథకం అమలును జూన్ 28 తేదీకి వాయిదా వేస్తూ కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నారు. 18.58 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు స్మార్ట్ మీటర్ల బిగింపునకు రూ.6,888 కోట్లను వ్యయం చేసేందుకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్ నెట్ కోసం రూ.445 కోట్ల రుణాల కోసం ఏపీ ఎఫ్‌ఎస్ఎల్‌కు అనుమతిస్తూ కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. జూన్ 12 నుంచి 17 వరకూ జగనన్న విద్యా కానుక వారోత్సవాల నిర్వాహణకు, పదో తరగతి పరీక్షల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు జగనన్న ఆణిముత్యాలు అవార్డులు ప్రదానం చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
63 అంశాలకు కేబినెట్ ఆమోదం
12వ పీఆర్‌సీ అమలుకు కేబినెట్ ఆమోదం
ప్రభుత్వ ఉద్యోగులకు జీపీఎస్ అమలుపై కేబినెట్ ఆమోదం
కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణకు కేబినెట్ ఆమోదం
6,840 కొత్త పోస్టుల మంజూరుకు కేబినెట్ ఆమోదం
ఇందులో పోలీస్ బెటాలియన్ 3,920...
కొత్త మెడికల్ కాలేజీల్లో 2,118 సహా మరి కొన్ని శాఖల్లో పోస్టులు
బీసీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో రెగ్యులర్ ఉద్యోగులకు ఆమోదం
కో -ఆపరేటివ్ సొసైటీల్లో సూపర్ న్యూమరీ పోస్టుకు ఆమోదం
అగ్రి కల్చర్ మార్కెటింగ్ డిపార్ట్‌మెంట్‌లో డిప్యూటీ ఈఈ పోస్టును ఈఈగా అప్ గ్రేడ్
కడప మానసిక వైద్య శాలలో 116 పోస్టులకు కేబినెట్ ఆమోదం
సీతానగరం పీహెచ్‌సీ అప్ గ్రేడ్‌కు 23 పోస్టులకు ఆమోదం
పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్...
డయాలసిస్ యూనిట్‌కు 41 మెడికల్ ఆఫీసర్లకు ఆమోదం
476 గవర్నమెంట్ జూనియర్ కాలేజీల్లో నైట్ వాచ్‌మెన్ పోస్టులకు ఆమోదం
2014 జూన్ నుంచి వివిధ ప్రభుత్వ శాఖలో పని చేస్తున్న..
10,117 మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌కు ఆమోదం
Thanks for reading Highlights of the AP Cabinet meeting @ 07.06.23
No comments:
Post a Comment