Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Monday, June 12, 2023

JVK 2023 Kits Instructions, Check List, Acquittance, Stock Register, Kit Tag


JVK 2023 Kits Instructions, Check List, Acquittance, Stock Register, Kit Tag 

జగనన్న విద్యా కాసుక 2023 విద్యార్థులకు కిట్లను క్షేత్ర స్థాయిలో రూపొందించుట, పంపిణీ కొరకు మార్గదర్శకాలు:

'జగనన్న విద్యాకానుక' స్టూడెంట్ కిట్ల పంపిణీపై ముఖ్య సూచనలు:

'జగనన్న విద్యాకానుక' స్టూడెంట్ కిట్లు జూన్ 12, 2023 నపంపిణీ చేయాలి.

'జగనన్న విద్యాకానుక' స్టూడెంట్ కిట్ల పంపిణీ పూర్తిగా బయో మెట్రిక్ విధానంలోనే చేయాలి. ఒకవేళ పాఠశాల నందు బయో మెట్రిక్ పరికరాలు పనిచేయని పరిస్తితులలో సమగ్రశిక్షా అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్లు సంబంధిత పాఠశాలల వివరాలను సేకరించి సంబంధిత జిల్లా కలెక్టర్ వారికి తెలియచేసి గ్రామ / వార్డ్ సచివాలయాల వద్ద ఉన్న బయో మెట్రిక్ పరికరాల ద్వారా స్టూడెంట్ కిట్ల పంపిణి జరిగేలా చర్యలు తీసుకోవాలి.

పాఠశాల ప్రధానోపాధ్యాయులు రోజు మరియు తరగతుల వారిగా స్టూడెంట్ కిట్ల పంపిణీ గురించి ముందుగానే విద్యార్ధుల యొక్క తల్లి తండ్రులకు తెలియచేయాలి. 

'జగనన్న విద్యాకానుక స్టూడెంట్ కిట్ల పంపిణీ వలన పాఠశాల పనితీరు మరియు బోధన కు ఎటువంటి అంతరాయం కలగకుండా చూసుకోవాలి.

ఒకరోజుకు సుమారుగా 30 నుండి 40 కిట్లు పూర్తి బయో మెట్రిక్ విధానంలో పంపిణీ జరిగేలా చూసుకోవాలి.

పాఠశాలలో కొత్తగా చేరిన విద్యార్థుల వివరాలు తప్పనిసరిగా అడ్మిషన్ రిజిస్టర్ లో నమోదు చేయాలి. తరువాత సంబంధిత విద్యార్థులకు కిట్లు అందచేయాలి. ఒకవేళ కొత్త విధ్యార్ధుల ప్రవేశాలు అధికంగా ఉండి, అదనముగా స్టూడెంట్ కిట్లు అవసరమైనప్పుడు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సంబందిత మండల విద్యాశాఖాధికారి ద్వారా జిల్లా అధికారులకు తద్వారా రాష్ట్ర కార్యాలయానికి తెలియచేయాలి.

పాఠశాల ప్రధానోపాధ్యాయులు తప్పనిసరిగా ప్రతి విద్యార్థికి సరిపడా సైజు అందేవిధంగా చూసుకోవాలి. ఒకవేళ సరిపడా సైజు లేని పక్షంలో సంబంధిత మండల విద్యాశాఖాధికారి కి తెలియచేసి పక్క మండలాల వద్ద ఉంటే, వారి వద్ద నుండి సేకరించి విద్యార్థికి అందేలా చూసుకోవాలి. 

'జగనన్న విద్యాకానుక' స్టూడెంట్ కిట్ల నాణ్యత ను విద్యార్ధులకు పంపిణీకి ముందు సరిచూసుకోవాలి. ఒకవేళ పాడైన, చిరిగిన వస్తువులు ఏమైనా గుర్తించినట్లైతే వాటి వివరాలు సంబందిత మండల విద్యాశాఖాధికారి ద్వారా జిల్లా అధికారులకు తద్వారా రాష్ట్ర కార్యాలయానికి తెలియచేయచేస్తూ కొత్తవి తిరిగి తీసుకొనేలా చూసుకోవాలి. 

పాఠశాలలో కొత్తగా చేరిన విద్యార్ధుల వివరాలను  లోపు సంబంధిత మండల విద్యాశాఖాధికారి ద్వారా జిల్లా అధికారులకు తద్వారా రాష్ట్ర కార్యాలయానికి తెలియచేయచేయాలి.  లోపు కొత్తగా చేరిన విద్యార్ధులకు కిట్లు అందచేయబడతాయి.

మండల కేంద్రాలలో మరియు స్కూల్ కాంప్లెక్స్ లలో తప్పనిసరిగా స్టాక్ రెజిస్టర్స్ ను నిర్వహించవలెను. రాష్ట్ర మరియు జిల్లా అధికారులు సందర్శనకు వచ్చినప్పుడు విధిగా స్టాక్ రిజిస్టర్స్ ను చూపించాలి. 

మండల కేంద్రాల నుండి స్కూల్ కాంప్లెక్స్ లకు మరియు స్కూల్ కాంప్లెక్స్ ల నుండి పాఠశాలలకు జగనన్న విద్యాకానుక కిట్టు తరలించే సమయంలో రవాణా మరియు ఇతర ఖర్చులను స్కూల్ కాంప్లెక్స్ గ్రాంట్స్ నుండి భరించవలెను.

Note: The front and outer cover of the note books along with front inners and back inners (total four places) has to be printed with a logo and information of Govt. Programmes related to school education.






డిక్షనరీ:

ఒకటో తరగతి విద్యార్థులకు పిక్టోరియల్ డిక్షనరీ, 6వ తరగతి విద్యార్థులకు ఆక్స్ ఫర్డ్ డిక్షనరీ కిట్ లో భాగంగా ఇవ్వవలసి ఉంటుంది.

కిట్లు రూపకల్పన చేయు విధానం:

బ్యాగులు అందిన తర్వాత 'స్టూడెంట్ కిట్' సిద్ధం చేసి ప్రభుత్వం ఖరారు చేసిన తేదీ నాటికి ప్రతి విద్యార్థికి అందించేలా సన్నద్ధులై ఉండాలి.

ఏ తరగతి విద్యార్థికి ఏయే వస్తువులు బ్యాగులో వేసి సిద్ధం చేయాలో పట్లోటికలో  పొందుపరచడమైనది.

ఈ కార్యక్రమం విజయవంతంగా అమలు చేయడానికి అమలు కోసం స్కూల్ కాంప్లెక్స్ పరిధిలో ఉన్న అందరు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సీఆర్పీలు మరియు కార్యాలయ సిబ్బంది సహాయ సహకారాలు తీసుకోవాలి. ఈ కార్యక్రమం సమిష్టి బాధ్యతగా భావించాలి.. 

ఉదాహరణకు ఆరో తరగతి అబ్బాయిలకు చెందిన స్టూడెంట్ కిట్ ఎలా సిద్ధం చేయాలో చూద్దాం.

పెద్ద సైజు బ్యాగు తీసుకోవాలి.

 ఆరో తరగతికి అబ్బాయిలకు కేటాయించిన 3 జతల యూనిఫాం క్లాత్ప్యా కెట్ బ్యాగులో వేయాలి. 

200 పేజీల వైట్ లాంగ్ (3), 200 పేజీల రూల్డ్ లాంగ్ (4), 200 పేజీల బ్రాడ్ రూల్డ్ (1) ఇలా మొత్తం 8 నోటు పుస్తకాలు బ్యాగులో వేయాలి.

4) తర్వాత 6 వ తరగతి పాఠ్యపుస్తకాలు బ్యాగులో చేయాలి. 

5) బాలురకు సంబంధించి రెండు వైపులా నవారు కలిగిన బెల్టు (90cm) బ్యాగులో వేయాలి. 

6) 6 వ తరగతికి కేటాయించిన ఒక ఆక్స్ ఫర్డ్ డిక్షనరీని బ్యాగులో వేయాలి.

7) ఆ విద్యార్థికి సంబంధించిన సరిపోయే బూట్లు మరియు తగిన రెండు జతల సాక్సులు బ్యాగులో వేసుకోవాలి. 

ఇలా తరగతి వారిగా బాలురకు విడిగా, బాలికలకు విడిగా కిట్లు సిద్ధం చేసుకుని ఉండాలి.

దీనితో స్టూడెంట్ కిట్ అన్ని వస్తువులతో సంపూర్ణంగా సిద్ధం చేసినట్లు పరిగణించాలి.

సిద్ధం చేసేటప్పుడు బ్యాగు చినిగిపోకుండా, మిగతా వస్తువులు పాడవకుండా చాలా జాగ్రత్త వహించాలి. 

ఇదే విధంగా ప్రతి పాఠశాలలోను బాలబాలికలకు సంబంధించిన కిట్లు సిద్ధం చేసుకోవాలి.

ఈ కార్యక్రమం అమలు కోసం స్కూల్ కాంప్లెక్స్ పరిధిలో ఉన్న అందరు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సీఆర్పీలు మరియు కార్యాలయ సిబ్బంది సహాయ సహకారాలు తీసుకోవాలి. ఈ కార్యక్రమం సమష్టి బాధ్యతగా భావించాలి. 

వీటన్నిటిని  టెక్స్ట్ పుస్తకాల తో కలిపి  కిట్  ను  తయారు చేయాలి. అన్నింటి నీ  బ్యాగ్ లో సర్ది  చెక్ లిస్ట్  తయారు చేసి బ్యాగ్ కు అంటించాలి.

JVK 2023-24 Important Links:

JVK KIT 2023-24 ACQUITTANCE FORMS DOWNLOAD

 JVK KIT ACQUITTANCE 2023-24 DOWNLOAD

J VK  KITS RECEIVED PARTICULARS 2023-24 DOWNLOAD

TEXT BOOKS ACQUITTANCE FOR THE ACADEMIC YEAR 2023-24 DOWNLOAD

 NOTE BOOKS ACQUITTANCE FOR ACADEMIC YEAR 2023-24 DOWNLOAD

 TEXT BOOKS ACQUITTANCE FOR ACADEMIC YEAR 2023-24 (FOR CLASS 8, 9 ,10) DOWNLOAD

TEXT BOOKS ACQUITTANCE FOR ACADEMIC YEAR 2023-24 (CLASS-6, CLASS-7) DOWNLOAD

TEXT BOOKS RECEIVED DETAILS FROM MRC FOR THE ACADEMIC YEAR 2023-24 DOWNLOAD

JVK KIT 2023 School Bag Tag 

JVK 2023-24 Issued Stock Register for MRCs, COMPLEX HMS click here

JVK Latest App click here

Download Shoe size conversion table

Download JVK 2023 Class wise, Gender wise Material for distribution

JVK 2023-24 Received Stock Register click here

JVK Kit ID Card / Tag / Label

JVK & Text Books Acquittance Class 1-10

Thanks for reading JVK 2023 Kits Instructions, Check List, Acquittance, Stock Register, Kit Tag

No comments:

Post a Comment