Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Sunday, July 9, 2023

Diploma in Paramedical courses in Andhra Pradesh


 APSAHPC: ఏపీ వైద్య కళాశాలల్లో పారామెడికల్‌ కోర్సులు

విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ స్టేట్ అలైడ్ అండ్ హెల్త్ కేర్ ప్రొఫెషన్స్ కౌన్సిల్(ఏపీఎస్‌ఏహెచ్‌పీసీ)... 2023-2024 విద్యా సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాలలు, ప్రైవేటు పారామెడికల్‌ కళాశాలల్లో అందుబాటులో ఉన్న వివిధ పారామెడికల్‌ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. రెండేళ్ల కాలపరిమితితో అందిస్తున్న ఈ కోర్సులకు అర్హత ఇంటర్మీడియట్‌. జులై 24వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశముంది. ఆయా కోర్సులు, అర్హతల వివరాలు...

కాలేజీలు- జిల్లాలు...

ఏపీలో మొత్తం తొమ్మిది ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలు, జిల్లాల్లోని పలు ప్రైవేటు పారామెడికల్‌ కళాశాలల్లో వివిధ పారామెడికల్‌ కోర్సులను అందిస్తున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో ఉన్న సీట్లకు ఆ కాలేజీ పరిధిలోని జిల్లాలకు చెందిన అభ్యర్థులు(లోకల్‌) దరఖాస్తు చేసుకోవాలి. 

ప్రభుత్వ కళాశాలలు... వాటి పరిధిలోకి వచ్చే జిల్లాలు

1. ఆంధ్ర మెడికల్‌ కాలేజీ, విశాఖపట్నం: విజయనగరం, విశాఖపట్నం

2. రంగరాయ మెడికల్‌ కాలేజీ, కాకినాడ: తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి

3. సిద్ధార్థ మెడికల్‌ కాలేజీ, విజయవాడ: కృష్ణా

4. గుంటూరు మెడికల్‌ కాలేజీ: గుంటూరు, ప్రకాశం

5. ఎస్వీ మెడికల్‌ కాలేజీ, తిరుపతి: పొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు

6. గవర్నమెంట్‌ మెడికల్‌ కాలేజీ, కడప: వైఎస్‌ఆర్‌ కడప

7. కర్నూలు మెడికల్‌ కాలేజీ: కర్నూలు

8. ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ, అనంతపురం: అనంతపురం

9. ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ, శ్రీకాకుళం: శ్రీకాకుళం 

సీట్లు: తొమ్మిది గవర్నమెంట్‌ కాలేజీల్లో వివిధ పారామెడికల్‌ కోర్సుల్లో మొత్తం 1053 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఆయా కాలేజీల పరిధిలోకి వచ్చే జిల్లాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. అలాగే వివిధ జిల్లాల్లో ప్రైవేటు పారామెడికల్‌ కాలేజీలు ఉండగా.. వాటిలో 17,254 పారా మెడికల్‌ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో మొత్తం 18,307 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

అందిస్తున్న కోర్సులు..

1. డిప్లొమా ఇన్‌ మెడికల్‌ ల్యాబ్‌ టెక్నాలజీ(డీఎంఎల్‌టీ)

2. డిప్లొమా ఇన్‌ మెడికల్‌ ఇమేజింగ్‌ టెక్నాలజీ(డీఎంఐటీ)

3. డిప్లొమా ఇన్‌ ఆఫ్తాల్మిక్‌ అసిస్టెంట్‌(డీఓఏ)

4. డిప్లొమా ఇన్‌ డయాలసిస్‌ టెక్నాలజీ(డీడీఐఏఎల్‌వై)

5. డిప్లొమా ఇన్‌ రెస్పిరేటరీ థెరఫీ(డీఆర్‌ఈఎస్‌టీ)

6. డిప్లొమా ఇన్‌ మెడికల్‌ స్టెరిలైజేషన్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ ఆపరేషన్‌ థియేటర్‌ టెక్నాలజీ(డీఎంఎస్‌టీ)

7. డిప్లొమా ఇన్‌ పెర్‌ఫ్యూజిన్‌ టెక్నాలజీ(డీ³ఈఆర్‌ఎఫ్‌యూ)

8. డిప్లొమా ఇన్‌ ఆప్టోమెట్రిక్‌ టెక్నీషియన్‌(డీఓటీ)

9. డిప్లొమా ఇన్‌ రేడియో థెరఫీ టెక్నీషియన్‌ (డీఆర్‌టీటీ)

10. డిప్లొమా ఇన్‌ రేడియోగ్రాఫిక్‌ అసిస్టెంట్‌(డీఆర్‌జీఏ)

11. డిప్లొమా ఇన్‌ డార్క్‌ రూమ్‌ అసిస్టెంట్‌ కోర్సు(డీడీఆర్‌ఏ)

12. డిప్లొమా ఇన్‌ కార్డియాలజీ టెక్నీషియన్‌ కోర్సు(డీకార్డియో)

13. డిప్లొమా ఇన్‌ క్యాత్ ల్యాబ్‌ టెక్నాలజీ(డీసీఎల్‌టీ)

14. డిప్లొమా ఇన్‌ ఈసీజీ టెక్నీషియన్‌ కోర్సు(డీఈసీజీ)

15. డిప్లొమా ఇన్‌ అనస్తీషీయా టెక్నీషియన్‌ కోర్సు(డీఏఎన్‌ఎస్‌)

16. డిప్లొమా ఇన్‌ మల్టిపర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్‌- మేల్‌(డీఎంపీహెచ్‌ఏ)

అర్హతలు: రెండేళ్ల కాలపరిమితి గల ఈ పారామెడికల్‌ కోర్సుల్లో ప్రవేశాలకు ఇంటర్మీడియట్‌ బైపీసీ ఉత్తీర్ణులై ఉండాలి. 

వయోపరిమితి: వయసు 16 ఏళ్లు నిండి ఉండాలి.

వ్యవధి: ఈ కోర్సుల వ్యవధి రెండేళ్లు. ఈ కోర్సులకు సంబంధించి ఇంగ్లిష్‌ మీడియంలో బోధన ఉంటుంది.

ఎంపిక విధానం: బైపీసీ విద్యార్థులు లేకుంటే.. ఎంపీసీ విద్యార్థులకు ప్రాధాన్యం ఇస్తారు. ఈ రెండు గ్రూపు విద్యార్థులు లేకుంటే ఇతర గ్రూపు విద్యార్థులకు ప్రవేశం కల్పించే అవకాశం ఉంది. సీట్లను ప్రభుత్వ రిజర్వేషన్ల మేరకు ప్రతిభ ఆధారంగా కేటాయిస్తారు.

దరఖాస్తు విధానం: ప్రభుత్వ కళాశాలల్లో ఉన్న సీట్లకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వెబ్‌సైట్‌ సూచించిన దరఖాస్తు నమూనాను పూర్తి చేసి సంబంధిత కళాశాల ప్రిన్సిపల్‌ చిరునామాకు పంపాలి. ప్రైవేటు పారామెడికల్‌ కళాశాలల్లో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత జిల్లా వైద్యారోగ్య అధికారికి కార్యాలయం చిరునామాకు పంపాల్సి ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: రూ.100.

దరఖాస్తుతో జత చేయాల్సిన పత్రాలు:  పదోతరగతి సర్టిఫికెట్‌, ఆధార్‌ కార్డు, ఇంటర్‌ సర్టిఫికెట్‌- మార్క్స్‌ షీట్స్‌, ఆరు నుంచి ఇంటర్‌ వరకు స్టడీ సర్టిఫికెట్లు, క్యాస్ట్‌ సర్టిఫికెట్‌ తదితరాలు జత చేయాలి.

ముఖ్యమైన తేదీలు...

ఆఫ్‌లైన్‌ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 24-07-2023.

కౌన్సెలింగ్ నిర్వహణ, అభ్యర్థుల కేటాయింపు: 01-08-2023.

తరగతులు ప్రారంభం: 01-09-2023.

Website Here

Notification Here

Thanks for reading Diploma in Paramedical courses in Andhra Pradesh

No comments:

Post a Comment