Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Wednesday, August 9, 2023

Havana Syndrome: Is there an effect of 'Havana Syndrome' in India..? What is the problem..


 Havana Syndrome: భారత్‌లో ‘హవానా సిండ్రోమ్‌’ ప్రభావం ఉందా..? ఏమిటీ సమస్య.. కేంద్రం ఏం చెప్పింది..?

భారత్‌లో హవానా సిండ్రోమ్ (Havana Syndrome) ఉనికి ఉందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తామని భారత ప్రభుత్వం వెల్లడించింది. 

అమెరికాతో పాటు పలుదేశాల అగ్ర నేతలు, దౌత్యకార్యాలయ అధికారులను హవానా సిండ్రోమ్ (Havana Syndrome) కలవరపెడుతోంది. భారత్‌లోనూ ఈ మిస్టరీ సిండ్రోమ్‌ ప్రభావం ఉందా? అన్న విషయంపై ఆందోళన వ్యక్తమవుతోంది. దీనిపై తాజాగా భారత ప్రభుత్వం కూడా దృష్టి సారించింది. ఈ సిండ్రోమ్ ఉనికి దేశంలో ఉందా..? అన్న కోణంలో దర్యాప్తు చేస్తామని తెలిపింది. దేశంలో అ అంతుపట్టని ఈ సమస్యకు సంబంధించి దర్యాప్తు చేయాలని కర్ణాటక హైకోర్టులో దాఖలైన ఓ పిటిషన్‌ విచారణ సందర్భంగా కేంద్రం వివరణ ఇచ్చింది.

భారత్‌లో హవానా సిండ్రోమ్‌ వ్యాప్తి, నిర్మూలన చర్యలపై దర్యాప్తు జరపాలంటూ బెంగళూరుకు చెందిన అమర్నాథ్‌ చాగు అనే వ్యక్తి కర్ణాటక హైకోర్టులో (Karnataka High court) పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ ఇటీవల విచారణకు రాగా.. దీనిపై కేంద్ర ప్రభుత్వం తన స్పందనను తెలియజేసింది. ఈ సిండ్రోమ్‌ ఉనికికి సంబంధించి మూడు నెలల్లో దర్యాప్తు పూర్తి చేస్తామని హైకోర్టుకు తెలిపింది. దీంతో మరోసారి ఈ సిండ్రోమ్‌ వ్యవహారం చర్చనీయాంశమయ్యింది.

ఏమిటీ సిండ్రోమ్‌..? లక్షణాలు ఏంటి..?

అమెరికా ఇంటెలిజెన్స్‌తో పాటు వివిధ దేశాల దౌత్యకార్యాలయ అధికారులకు ఎదురైన మానసిక ఆరోగ్య లక్షణాలనే హవానా సిండ్రోమ్‌గా (Havana Syndrome) వ్యవహరిస్తున్నారు. దానికి గురైన వారిలో బయట ఎటువంటి శబ్దం లేకున్నా భారీ శబ్దం వినిపించడం, మైగ్రెయిన్, వికారం, జ్ఞాపకశక్తి మందగించడం, మైకం వంటి లక్షణాలు కనిపిస్తున్నట్లు గుర్తించారు. ఈ సిండ్రోమ్‌ను తొలిసారి క్యూబాలోని హవానా నగరంలోని అమెరికా దౌత్యకార్యాలయం సిబ్బందిలో గమనించారు. ఆ నగరం పేరుమీదుగా దీన్ని హవానా సిండ్రోమ్‌గా పిలుస్తున్నారు.

రెండేళ్లయినా మిస్టరీగానే..

ఈ హవానా సిండ్రోమ్‌ లక్షణాలకు కచ్చితమైన కారణాలు మాత్రం ఇప్పటివరకు గుర్తించలేకపోయారు. దీంతో ఇదో మిస్టరీగానే ఉండిపోయింది. అయితే, ఎలక్ట్రానిక్‌ పరికరాల నుంచి వచ్చే మైక్రోవేవ్ తరంగాల కారణంగా ఈ పరిస్థితి తలెత్తుతోందని అమెరికా అనుమానిస్తోంది. భారీ శబ్దాలను విడుదల చేసే పరికరాలు, అధిక ఫ్రీక్వెన్సీ కలిగిన ధ్వని తరంగాలు ఇందుకు కారణం కావొచ్చని కొందరి వాదన. మరికొందరు నిపుణులు మాత్రం హిస్టీరియా లేదా మానసిక వ్యాధికారణాల వల్ల ఈ సమస్య తలెత్తే అవకాశం ఉందని చెబుతున్నారు. ఏదేమైనా ఈ సమస్యకు స్పష్టమైన కారణాలు మాత్రం ఇంకా వెల్లడికాలేదు.

అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ 2021 ఆగస్టులో వియత్నాం పర్యటన ఈ సిండ్రోమ్ కారణంగానే కొన్ని గంటల పాటు ఆలస్యమైనట్లు తెలిసింది. అటు అమెరికా సెంట్రల్ ఇంటిలిజెన్స్ ఏజెన్సీ(సీఐఏ) డైరెక్టర్ విలియమ్ బర్న్స్‌తో కలిసి భారత్‌లో ప్రయాణించిన అధికారిలోనూ హవానా లక్షణాలు కనిపించాయనే వార్తలు వచ్చాయి. 2021 సెప్టెంబర్‌ నెలలో ఈ ఘటన వెలుగు చూసిందని అమెరికా వార్తా సంస్థలు అప్పట్లో పేర్కొన్నాయి. ఆ బాధిత వ్యక్తి చికిత్స పొందాల్సి ఉందని పేర్కొన్నాయి.

Thanks for reading Havana Syndrome: Is there an effect of 'Havana Syndrome' in India..? What is the problem..

No comments:

Post a Comment