Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Friday, December 8, 2023

Indira Gandhi National Open University Non teaching jobs in IGNOU Notification for 102 JAT, Stenographer Posts


 

Indira Gandhi National Open University  Non teaching jobs in IGNOU Notification for 102 JAT, Stenographer Posts

ఇగ్నోలో నాన్‌ టీచింగ్‌ కొలువులు

‣ 102 జేఏటీ, స్టెనోగ్రాఫర్‌ పోస్టులకు నోటిఫికేషన్

ఇందిరాగాంధీ నేషనల్‌ ఓపెన్‌ యూనివర్సిటీ (ఇగ్నో) 102 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఇంటర్మీడియట్, టైపింగ్, షార్ట్‌హ్యాండ్‌ అర్హతలతో ప్రముఖ సంస్థలో కొలువు సాధించాలని ఆశించేవాళ్లు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులను కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌ ద్వారా ఎంపిక చేస్తారు. 

జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ టైపిస్ట్‌ (జేఏటీ): 50 ఉద్యోగాలు. వీటిలో అన్‌రిజర్వుడ్‌కు 19, ఎస్సీలకు 08, ఎస్టీలకు 04, ఓబీసీలకు 14, ఈడబ్ల్యూఎస్‌లకు 05 కేటాయించారు. అభ్యర్థులు 10+2 లేదా తత్సమాన పరీక్ష పాసవ్వాలి. కంప్యూటర్‌పై ఇంగ్లిష్‌లో నిమిషానికి 40 పదాలు/ హిందీలో నిమిషానికి 35 పదాలు టైప్‌ చేయగలగాలి. డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుంది. 21.12.2023 నాటికి గరిష్ఠ వయసు 18-27 సంవత్సరాల మధ్య ఉండాలి.

స్టెనోగ్రాఫర్‌: 52 ఖాళీలు. వీటిల్లో అన్‌రిజర్వుడ్‌కు 23, ఎస్సీలకు 07, ఎస్టీలకు 03, ఓబీసీలకు 14, ఈడబ్ల్యూఎస్‌లకు 05 కేటాయించారు. అభ్యర్థులు 10+2 లేదా తత్సమాన పరీక్ష పాసవ్వాలి. కంప్యూటర్‌పైన ఇంగ్లిష్‌లో నిమిషానికి 40 పదాలు/ హిందీలో నిమిషానికి 35 పదాలు టైప్‌ చేయగలగాలి. 

‣ షార్ట్‌హ్యాండ్‌లో నిమిషానికి 80 పదాల వేగం ఉండాలి. డిగ్రీ పాసై, కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యమిస్తారు. 21.12.2023 గరిష్ఠ వయసు 18-30 సంవత్సరాల మధ్య ఉండాలి. 

‣ అన్‌రిజర్వుడ్, ఓబీసీ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ.1000. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, మహిళలు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.600. గరిష్ఠ వయసులో ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీ (ఎన్‌సీఎల్‌)కు 3 ఏళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10-15 ఏళ్లు, ఎక్స్‌సర్వీస్‌మెన్‌కు 3 ఏళ్ల సడలింపు ఉంటుంది. 

ఎంపిక: అభ్యర్థుల ఎంపిక రెండు దశల్లో జరుగుతుంది. 

‣ టైర్‌-1లో కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష (సీబీటీ)ను రెండు పోస్టులకూ కలిపి నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం హిందీ/ఇంగ్లిష్‌ భాషల్లో ఉంటుంది.

టైర్‌-1: (జేఏటీ, స్టెనోగ్రాఫర్‌ పోస్టులకు): దీంట్లో 5 సెక్షన్లు ఉంటాయి. సెక్షన్‌-1లో మేథమెటికల్‌ ఎబిలిటీస్‌-30 మార్కులు, సెక్షన్‌-2లో రీజనింగ్‌ అండ్‌ జనరల్‌ ఇంటెలిజెన్స్‌-30 మార్కులు, సెక్షన్‌-3లో హిందీ/ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ అండ్‌ కాంప్రహెన్షన్‌-30 మార్కులు, సెక్షన్‌-4లో జనరల్‌ అవేర్‌నెస్‌-30 మార్కులు, సెక్షన్‌-5లో కంప్యూటర్‌ నాలెడ్జ్‌-30 మార్కులు ఉంటాయి. 

టైర్‌-2: ఇది రెండు పోస్టులకు వేర్వేరుగా ఉంటుంది. టైర్‌-1లో ఎంపికైనవారికి టైర్‌-2లో హిందీ లేదా ఇంగ్లిష్‌ భాషల్లో స్కిల్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. 

‣ జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ టైపిస్ట్‌ పోస్టుకు స్కిల్‌/ టైపింగ్‌ టెస్ట్‌ ఉంటుంది. ఇంగ్లిష్‌లో టైపింగ్‌ వేగం నిమిషానికి 40 పదాలు లేదా హిందీలో 35 పదాలు ఉండాలి. 

‣ స్టెనోగ్రాఫర్‌ పోస్టుకు టైర్‌-2లో స్కిల్‌ టెస్ట్‌ (స్టెనోగ్రఫీ, టైపింగ్‌) నిర్వహిస్తారు. ఇది హిందీ లేదా ఇంగ్లిష్‌ భాషల్లో ఉంటుంది. స్టెనోగ్రఫీలో నిమిషానికి 80 పదాల వేగం ఉండాలి. ఇంగ్లిష్‌లో టైపింగ్‌ వేగం నిమిషానికి 40 పదాలు లేదా హిందీలో 35 పదాలు ఉండాలి.  

‣ దరఖాస్తుకు చివరి తేదీ: 21.12.2023

‣ దరఖాస్తు సవరణ తేదీలు: 22-25 డిసెంబరు, 2023

‣ వెబ్‌సైట్‌: https://exams.nta.ac.in/

టైర్‌-1లోని సెక్షన్లు

‣ మ్యాథమెటికల్‌ ఎబిలిటీస్‌: నంబర్‌ సిస్టమ్స్, ఆల్జీబ్రా, జామెట్రీ, మెన్సురేషన్, ట్రిగనోమెట్రీ, స్టాటిస్టిక్స్‌-ప్రాబబిలిటీ.. మొదలైన అంశాల నుంచి ప్రశ్నలు ఇస్తారు. 

‣ రీజనింగ్‌ అండ్‌ జనరల్‌ ఇంటెలిజెన్స్‌: వెర్బల్‌-నాన్‌వెర్బల్, వెన్‌డయాగ్రమ్స్, నంబర్‌ సిరీస్, క్రిటికల్‌ థింకింగ్, ప్రాబ్లమ్‌ సాల్వింగ్, ఎమోషనల్, సోషల్‌ ఇంటెలిజెన్సీ, వర్డ్‌ బిల్డింగ్, కోడింగ్‌-డీకోడింగ్, న్యూమరికల్‌ ఆపరేషన్స్‌.. మొదలైన అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. 

‣ ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ అండ్‌ కాంప్రహెన్షన్‌: ఒకాబ్యులరీ, గ్రామర్, సెంటెన్స్‌ స్ట్రక్చర్, సిననిమ్స్, యాంçనిమ్స్, స్పాట్‌ ద ఎర్రర్, ఫిల్‌ ఇన్‌ ద బ్లాంక్స్, స్పెల్లింగ్స్, డిటెక్టింగ్‌ మిస్‌-స్పెల్ట్‌ వర్డ్స్, ఇడియమ్స్, ఫ్రేజెస్, యాక్టివ్‌ పాసివ్‌ వాయిస్‌ ఆఫ్‌ వెర్బ్స్, కాంప్రహెన్షన్‌ పాసేజ్‌ల నుంచి ప్రశ్నలు అడుగుతారు. 

‣ జనరల్‌ అవేర్‌నెస్‌: దీంట్లోని ప్రశ్నలు పరిసరాల పట్ల అభ్యర్థికి ఉంటే అవగాహన, పరిజ్ఞానాన్ని పరీక్షించేలా ఉంటాయి. దేశ చరిత్ర, సంస్కృతి, భౌగోళిక పరిస్థితులు, ఆర్థిక వ్యవస్థ, శాస్త్రీయ పరిశోధనలపై ప్రశ్నలు ఇస్తారు. 

‣ కంప్యూటర్‌ నాలెడ్జ్‌: కంప్యూటర్‌ బేసిక్స్, వర్కింగ్‌ విత్‌ ఇంటర్నెట్‌ అండ్‌ ఈ-మెయిల్స్, ఈ-బ్యాంకింగ్, సైబర్‌ సెక్యూరిటీ.. మొదలైన అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.

Thanks for reading Indira Gandhi National Open University Non teaching jobs in IGNOU Notification for 102 JAT, Stenographer Posts

No comments:

Post a Comment