RRC East Central Railway Recruitment 2025, Apply Online for 1154 posts
RRC: ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో 1,154 యాక్ట్ అప్రెంటిస్ ఖాళీలు
బిహార్ రాష్ట్రం, పట్నలోని ఈస్ట్ సెంట్రల్ రైల్వే- రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (ఆర్‌ఆర్‌సీ) ఈస్ట్ సెంట్రల్ రైల్వే పరిధిలోని డివిజన్, యూనిట్‌లలో యాక్ట్ అప్రెంటిస్ శిక్షణ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 14వ తేదీలోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
యూనిట్స్/ డివిజన్లు: దనపుర్ డివిజన్, ధన్‌బాద్ డివిజన్, పండిట్ దీన్‌దాయాల్ ఉపాద్యాయ డివిజన్, సోన్‌పుర్ డివిజన్, సమస్తిపుర్ డివిజన్, ప్లాంట్ డిపోట్, క్యారేజ్ రిపేర్ వర్క్‌షాప్/ హర్నాట్, మెకానికల్ వర్క్‌షాప్/ సమస్తిపుర్.
ఖాళీల వివరాలు:
* యాక్ట్ అప్రెంటిస్: 1,154 ఖాళీలు
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో మెట్రిక్యూలేషన్/పదో తరగతి లేదా తత్సమాన విద్యార్హతతో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. ఎన్‌సీవీటీ జారీచేసిన నేషనల్ నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
ట్రేడ్‌లు: ఫిట్టర్, వెల్డర్, మెకానిక్ (డిజిల్), మెషినిస్ట్, కార్పెంటర్, పెయింటర్, లైన్‌మ్యాన్, వైర్‌మ్యాన్, ఎలక్ట్రీషియన్, ఎంఎంటీఎం, సివిల్ ఇంజినీర్, టర్నర్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ మెకానిక్, ఎలక్ట్రానిక్ మెకానిక్, టర్నర్, ఫోర్జర్ అండ్ హీట్ ట్రీటర్
వయోపరిమితి: 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: మెట్రిక్యులేషన్, ఐటీఐ మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు రుసుము: రూ.100.
ముఖ్య తేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 25-01-2025.
ఆన్‌లైన్ దరఖాస్తుకు గడువు: 14-02-2025.
ముఖ్యాంశాలు:
* పట్నలోని ఈస్ట్ సెంట్రల్ రైల్వే యాక్ట్ అప్రెంటిస్ శిక్షణ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది.
* అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 14వ తేదీలోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
RRC East Central Railway Apprentice Notification
Thanks for reading RRC East Central Railway Recruitment 2025, Apply Online for 1154 posts
No comments:
Post a Comment