కృష్ణాష్టమి సందేశాలు (Janmashtami Quotes In Telugu)
చిన్ని కృష్ణుడు మీ ఇంట సందడి చేయాలి. తన మాయతో మీ బాధలు, కష్టాలు తొలగించి మీ ఇంట సంతోషాన్ని నింపాలని కోరుకుంటున్నా. కృష్ణాష్టమి శుభాకాంక్షలు
అసురత్వాన్ని అంతం చేయడానికి, ధర్మాన్ని నిలబెట్టడానికి వాసుదేవుడు పుట్టిన కృష్ణాష్టమి పర్వదినం మీ జీవితంలో సుఖసంతోషాలను నింపాలి. శ్రీకృష్ణ పరమాత్ముని ఆశీస్సులు మీకు దక్కాలి.
మహాభారత యుద్ధంలో అర్జునుడికి దారి చూపినట్లుగా.. మీ జీవితంలోనూ కృష్ణుడు దారి చూపించాలి. ఆ పరమాత్ముని ఆశీస్సులతో మీకంతా శుభమే జరగాలి. కృష్ణాష్టమి శుభాకాంక్షలు.
మీరు ఏ పని చేయాలనుకుంటే ఆ పని చేయండి. అందులో దురాశ, అహం, కోరిక కనిపించకూడదు. అందులో ప్రేమ, కరుణ, భక్తి, వినయం ఉండాలి. కృష్ణాష్టమి శుభాకాంక్షలు
జీవం మొదలెక్కడో తెలియదు. తుది ఏమిటో తెలియదు. మధ్యలో ఏం జరుగుతుందో తెలియదు. తెలియని దాని కోసం విచారించాల్సిన అవసరం లేదు – భగవద్గీత
ఆత్మను ఏ ఖడ్గం చీల్చలేదు. ఏ మంటలు దహించివేయలేవు. ఎంత నీరైనా కరిగించలేదు. ఎంత గాలి వీచినా కదిలించలేదు. జన్మాష్టమి శుభాకాంక్షలు.
మనసు దృఢంగా ఉన్నవారి బుద్ధి నిశ్చలంగా ఉంటుంది. అలా లేని వారి బుద్ధి పరి పరి విధాలుగా మారిపోతుంది – భగవద్గీత.
శ్రీకృష్ణుడి వేణుగానమంత మధురమైన ప్రేమ మీ జీవితంలో నిండాలని, ఆ గీతాచార్యుని ఆశీస్సులు మీకు దక్కాలని కోరుకుంటూ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు
ఏది సాధించాలన్నా కష్టించాల్సిందే. కష్టపడనిదే అదృష్టం సైతం కలసి రాదు. మీరు చేసే పనికి అదృష్టం తోడవ్వాలని కోరుకుంటూ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు.
ఈ కృష్ణాష్టమి మీ జీవితంలో సంతోషాన్ని, విజయాలను తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నాను. ప్రేమ, వాత్సల్యాలతో ఈ పండగను జరుపుకుని ఆనందంగా గడపాలని కోరుకుంటున్నాను.
శ్రీ కృష్ణ జననం (Sri Krishna Birth Secret)
శ్రీకృష్ణ లీలామృతం (Sri Krishna Leelamrutham)
శ్రీకృష్ణాష్టమి విశిష్టత (Krishna Janmashtami In Telugu – Significance)
కృష్ణాష్టమి పూజా విధానం (Pooja process)
కృష్ణాష్టమి వ్రతం విధి విధానాలు (Sri Krishnastami Vrata Importance)
శ్రీకృష్ణాష్టమి నైవేద్యాలు (Prasada Nivedana)
ఉట్టి కొట్టడం (Significance of Utti(Dahi Handi)
తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రముఖ శ్రీకృష్ణ దేవాలయాలు (Famous Krishna Temples In Telugu States)
Thanks for reading కృష్ణాష్టమి సందేశాలు (Janmashtami Quotes In Telugu)
No comments:
Post a Comment