Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Thursday, August 18, 2022

శ్రీకృష్ణ లీలామృతం (Sri Krishna Leelamrutham)


 శ్రీకృష్ణ లీలామృతం (Sri Krishna Leelamrutham)

భూమి మీద అధర్మం, అరాచకత్వం పెరిగిపోయి ధర్మం కానరానప్పుడు విష్ణుమూర్తి మానవ అవతారంలో జన్మించి అసుర సంహారం జరిపించి తిరిగి ధర్మాన్ని నెలకొల్పుతాడని హిందూమతం విశ్వసిస్తుంది. ధర్మాన్ని నిలబెట్టడానికి, మానవాళిని సంరక్షించడానికి.. విష్ణుమూర్తి ఎత్తిన ఎనిమిదో అవతారమే శ్రీకృష్ణ అవతారం. తన మామ కంసుడు చేస్తున్న దాష్టీకాల నుంచి జనులను రక్షించేందుకు, అసుర సంహారం, అధర్మ వినాశనం చేయడం ద్వారా భూలోకంలో తిరిగి ధర్మస్థాపన చేశాడు. ఈ అవతారంలో కంసాది దానవులను సంహరించాడు. ధర్మాన్ని పాటించిన పాండవులకు అండగా నిలిచి అధర్మాన్ని ఓడించాడు. గీతాకారునిగా యుద్ధరంగంలో అర్జునుడికి హితబోధ చేశాడు. పుట్టుకచావుల పరమార్థం తెలిపాడు. దాన్నే భగవద్గీతగా మనం చదువుతున్నాం.

జన్మించిన నాటి నుంచి శ్రీకృష్ణుడు దేవతామూర్తిగా పూజలందుకుంటూనే ఉన్నాడు. అల్లరి బాలకుడిగా, వెన్నదొంగగా, గోపీలోలుడిగా, గోవర్ధన గిరిధారిగా, కాళీయమర్ధనుడిగా, గీతాప్రబోధకుడిగా, అసుర సంహారిగా తాను చేసిన ప్రతి పని ద్వారా మానవాళికి అద్భుతమైన సందేశాన్నిస్తూనే ఉన్నాడు. వెన్నను దొంగిలించి గోపబాలురకు పంచిపెట్టడం ద్వారా.. మనకున్నది నలుగురికివ్వడం వల్ల కలిగే సంతోషం ఎలా ఉంటుందో చేసి చూపించాడు.

తనకు బదులుగా గోవర్ధన గిరిని పూజించారనే కోపంతో ఇంద్రుడు రేపల్లెపై ఏకధాటిగా వానను కురిపిస్తే.. ఆ దాడి నుంచి తనవారిని, పశుపక్ష్యాదులను రక్షించడానికి.. గోవర్ధన పర్వతాన్ని తన చిటికెన వేలుపై నిలిపాడు. ఆ విధంగా ఇంద్రుడి మదాన్ని అణిచివేశాడు. పుట్టగానే తల్లిదండ్రులకు, యుద్ధ భూమిలో అర్జునుడికి కర్తవ్యబోధ చేశాడు. అందుకే ఆయన్ను ‘కృష్ణం వందే జగద్గురుమ్’ అని కీర్తిస్తారు.

కృష్ణతత్వం అనంతమైనది. దాన్ని అర్థం చేసుకుంటేనే అందులోని మర్మం అర్థమవుతుంది. కుచేలుని నుంచి అటుకులు గ్రహించి అంతులేని సిరిసంపదలు ప్రసాదించిన కృష్ణుడు ప్రేమతో, భక్తితో తనకు ఏది సమర్పించినా ఆనందంగా స్వీకరిస్తాడు. భోగభాగ్యాలు ప్రసాదిస్తాడు. అలాగే కర్మఫలాన్ని సైతం అనుభవించాల్సిందేనంటాడు. దీనికి కుచేలుడే ఉదాహరణ. సుధాముడు తన స్నేహితుడే అయినప్పటికీ, కటిక పేదరికాన్ని అనుభవిస్తున్నప్పటికీ కర్మ ఫలితం తీరేదాకా అనుగ్రహించలేదు.

మహాభారత యుద్ధంలోనూ తన యుద్ధనీతిని ప్రదర్శించాడు. అధర్మాన్ని అంతమొందించడానికి మాయోపాయాలు పన్నాడు. అబద్ధమాడని ధర్మరాజు చేత ‘అశ్వత్థామ హత: కుంజర:’ అని అబద్ధమాడించాడు. కర్ణుడిని నిస్సహాయుణ్ని చేయడానికి విదురుడ్ని, భీష్ముడిని నిలువరించడానికి శిఖండిని ఉపయోగించాడు. యుద్ధంలో ఓడిపోయిన తర్వాత చెరువులో దాక్కున్న దుర్యోధనుడిని సంహరించడానికి సైతం మాయోపాయాన్నే పన్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే కృష్ణలీలలు ఎన్నో. ఎన్నెన్నో.

శ్రీ కృష్ణ జ‌ననం (Sri Krishna Birth Secret)


శ్రీకృష్ణాష్ట‌మి విశిష్టత (Krishna Janmashtami In Telugu – Significance)


కృష్ణాష్ట‌మి పూజా విధానం (Pooja process)


కృష్ణాష్ట‌మి వ్రతం విధి విధానాలు (Sri Krishnastami Vrata Importance)


శ్రీకృష్ణాష్టమి నైవేద్యాలు (Prasada Nivedana)


కృష్ణాష్ట‌మి రోజు ఇంట్లో కృష్ణ పాదాలు ఎందుకు వేస్తారు? (Reason Behind Painting Krishna Padalu On Floor On The Day Of Krishna Astami)


ఉట్టి కొట్టడం (Significance of Utti(Dahi Handi)


తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రముఖ శ్రీకృష్ణ దేవాలయాలు (Famous Krishna Temples In Telugu States)


కృష్ణాష్టమి సందేశాలు (Janmashtami Quotes In Telugu)


Thanks for reading శ్రీకృష్ణ లీలామృతం (Sri Krishna Leelamrutham)

No comments:

Post a Comment