TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Sunday, April 17, 2022

How to recognize that your immunity is weak?


 మీ ఇమ్యూనిటీ బలహీనమైందని గుర్తించడం ఎలా?  ఈ మార్పులు గమనించి మీకు మీరే మీ ఇమ్యూనిటీని నిర్ధారించుకోండి!


కోవిడ్‌ కాలంలో బాగా వినిపించిన మాట ఇమ్యూనిటీ (రోగనిరోధక శక్తి). ప్రతి ఒక్కరూ రోగనిరోధక శక్తిని పెంచుకోవాలని, అదే కోవిడ్‌కు సంజీవనిలా పనిచేస్తుందని చెప్పారు కూడా.

అప్పటినుంచి సామాన్యుల నుంచి ధనికులు, సెలబ్రిటీలు ప్రతి ఒక్కరూ ఇమ్యూనిటీని పెంచే ఆహారాలు, పానీయాలు రోజూవారీ భోజనంలో చేర్చుకుంటున్నారు. అయితే అసలు రోగ నిరోధకశక్తి బలహీనమైందని ఎలా తెలుస్తుంది? ఒక్క కోవిడ్‌కే కాదు ఏ వ్యాధి నుంచైనా మనల్ని రక్షించగలిగేది రోగనిరోధక శక్తే. దాన్నెప్పుడూ బలంగా, బలవర్థకంగా నిలుపుకోవాల్సిందే. నీరసంగా ఉంటే ఏదైనా పండ్లు, సలాడ్‌లు తీసుకోవడం, జ్వరంగా ఉంటే వైద్యుల దగ్గరకు వెళ్తాం. మరి ఇమ్యూనిటీ బలహీనమైందని గుర్తించడం ఎలా? ఇదిగో ఈ మార్పులు గమనించి మీకు మీరే మీ ఇమ్యూనిటీని నిర్ధారించుకోండి

బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ తరచూ వివిధ వ్యాధులు, తీవ్రమైన ఆరోగ్య సమస్యలను స్వాగతిస్తుంది. మన శరీర రక్షణ కవచమైన రోగ నిరోధకశక్తి బలహీనమైతే రకరకాల వైరస్‌లు, బాక్టీరియాలు మనమీద అదే పనిగా దాడి చేస్తుంటాయి. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరికీ రోగనిరోధక శక్తిపై స్పష్టమైన అవగాహన ఉండాలి.

కోపం : ఎప్పుడూ ప్రశాంతంగా ఉండండి. చిరాకు, కోపం వంటివి వచ్చినప్పుడు గుర్తించడం చాలా అవసరం. సాధారణ విషయాలకు కూడా నిగ్రహాన్ని కోల్పోతున్నారంటే మీ శరీరక్రియలు అపసవ్యంగా జరుగుతున్నాయనడానికి సంకేతం. మీ శరీర ఆరోగ్య ప్రభావం మీ మెదడు మీద తప్పక ప్రభావం చూపుతుంది. అందుకే మీకెప్పుడైనా చిరాకు, కోపంగా ఉన్నప్పుడు మీ శరీరం ఏదైనా ఇనెఫెక్షన్‌కు గురైందో లేదో గమనించుకోండి. తరచూ వైరస్‌ బారిన పడుతున్నప్పుడు వీలైనంత త్వరగా వైద్యులను సంప్రదించాలి.

అలసట : తరచూ వైరస్‌, బ్యాక్టీరియాలకు లోనవుతుంటే వాటిని ఎదుర్కొనేందుకు శరీరం అధిక శక్తిని ఉపయోగిస్తుంది. పోషకాహారం తీసుకున్న తరువాత, తగినంత విశ్రాంతి తీసుకున్న తరువాత కూడా మీరు తీవ్ర అలసటకు గురవుతుంటే మీ శరీర రోగనిరోధక శక్తి రాజీపడుతోందని అర్థం చేసుకోవాలి.

తాజా గాయం : మీ శరీరంపై సుదీర్ఘకాలం పాటు కోసిన గాయాలు లేదా కాలిన గాయాలు మానకుండా ఇబ్బందిపెడుతుంటే ఆ సమస్య రోగనిరోధకశక్తి బలహీనపడడం వల్లేనని గుర్తించాలి. ఎందుకంటే బలమైన రోగనిరోధకశక్తి ఉన్నవాళ్ల శరీరంపై అటువంటి గాయాలు చాలా త్వరగా మానుతాయి.

దీర్ఘకాలం చలి : ఏడాదికాలంలో అప్పుడప్పుడూ జలుబు చేయడం సర్వసాధారణం. కానీ తరచూ మీకు జలుబు చేయడం, అది దీర్ఘకాలం కొనసాగడం బలహీన రోగనిరోధకశక్తికి సంకేతం. ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నవారికి సులభంగా జలుబు చేస్తుంది. అటువంటి వారు తీవ్రమైన శారీరక శ్రమ చేసినా, మానసికంగా ఒత్తిడికి గురైనా అనారోగ్యం పాలవుతారు.

ఈ లక్షణాలను మీరు గమనించుకున్నట్లయితే వెంటనే వైద్యులను సంప్రదించి మీ రోగనిరోధకశక్తిని పటిష్టపరుచుకోవాలి. మీ ఆహారపు అలవాట్లలో కొద్దిగా మార్చుకోవడం ద్వారా రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసుకోవచ్చు లేదా పునరుజ్జీవింపజేసుకోవచ్చు. అందుకోసం తాజా పండ్లు, కూరగాయలు ఆహారంలో భాగం చేసుకోవాలి. యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు సంవృద్ధిగా ఉన్న ఆహారాన్ని అనుసరించడం వల్ల రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసుకోవచ్చు.

(Disclaimer: The information given in this article is based on general assumptions. tlmweb.in does not confirm the same. Please contact the relevant expert before implementing them)

Thanks for reading How to recognize that your immunity is weak?

No comments:

Post a Comment