TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Wednesday, April 13, 2022

Instant Loan: You can take a loan from Google Pay, Phone Pay, Paytm apps ..!


 Instant Loan : గూగుల్ పే , ఫోన్ పే , పేటీఎం యాప్ల నుంచి లోన్ తీసుకోవచ్చు ..



మీరు మీ మొబైల్ ఫోన్‌లో ఉపయోగిస్తున్న UPI యాప్‌ల నుంచి లోన్ తీసుకోవచ్చు. అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే, దానిపై ఎటువంటి వడ్డీ వసూలు చేయరు. మీరు Phone Pe , Paytm, Google Pay నుంచి సులభంగా లోన్ తీసుకోవచ్చు.

ఈ యాప్‌లన్నీ ఇన్‌స్టంట్ లోన్‌ను అందిస్తున్నాయి. దీని కోసం కనీస పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్ కంపెనీ ఫోన్‌పే తన కస్టమర్ల కోసం ఇటీవలే రుణ సదుపాయాన్ని ప్రారంభించింది. మీరు లోన్ కోసం దరఖాస్తు చేసుకోవాలి, ఆ తర్వాత ఒకటి లేదా రెండు ముఖ్యమైన పత్రాలను ఇవ్వడంతో మీకు లోన్‌ వస్తుంది. ముందుగా PhonePe నుంచి లోన్ ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం.

ఫోన్‌ పే లోన్‌

PhonePe నేరుగా కస్టమర్లకు రుణం ఇవ్వదు. కానీ మాతృ సంస్థ Flipkart నుంచి రుణం పొందడంలో సహాయపడుతుంది. లోన్ పొందడానికి మీరు PhonePe, Flipkart యాప్ రెండింటికీ కనెక్ట్ అయి ఉండాలి. జీరో పర్సెంట్ లోన్ తీసుకోవడానికి, మీరు ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, CIBIL స్కోర్ (700 ప్లస్) అందించాలి. PhonePeతో మీరు రూ.60,000 వరకు తక్షణ రుణాన్ని పొందవచ్చు. 45 వేల కంటే ఎక్కువ రుణం తీసుకుంటే 0.34 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఫోన్‌లో మీరు PhonePe, Flipkart యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవాలి. మీరు మీ మొబైల్ నంబర్‌ను PhonePeతో నమోదు చేసుకోవాలి. మీరు అదే మొబైల్ నంబర్‌తో ఫ్లిప్‌కార్ట్‌లో కూడా నమోదు చేసుకోవాలి. దీని తర్వాత ఫ్లిప్‌కార్ట్ ప్రొఫైల్ విభాగానికి వెళ్లి, ఫ్లిప్‌కార్ట్ పే లేటర్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. ఫ్లిప్‌కార్ట్ నుంచి మీ డాక్యుమెంట్‌లలో కొన్నింటిని అడుగుతారు. అవి ఇవ్వాల్సి ఉంటుంది. మీకు ఇప్పటికే ఖాతా లేకుంటే, మీరు ముందుగా ఫ్లిప్‌కార్ట్ పే లేటర్ ఖాతాను సృష్టించాలి. ఇక్కడ CIBIL స్కోర్ అడుగుతుంది. మీకు సరైన CIBIL స్కోర్ ఉంటే, మీరు సులభంగా మంచి లోన్ పొందవచ్చు. ‘మై మనీ’ ఎంపికను క్లిక్ చేయడం ద్వారా UPI ఖాతా బ్యాలెన్స్‌ని చెక్ చేయండి. ఇది మీ లోన్ డబ్బు వచ్చిందో లేదో తెలుస్తుంది.

గూగుల్ పే లోన్

మీరు Google Pay నుంచి సులభంగా లోన్ తీసుకోవచ్చు. Google Pay నేరుగా రుణాలు ఇవ్వనప్పటికీ బ్యాంకుల నుంచి రుణాలు పొందడంలో సహాయపడుతుంది. ఉదాహరణకు మీరు ఫెడరల్ బ్యాంక్ నుంచి రుణం తీసుకోవాలనకుంటే. ముందుగా మీరు Google Pay యాప్‌ని తెరిచి, డబ్బు విభాగానికి వెళ్లి ఇక్కడ ‘లోన్’పై క్లిక్ చేయండి. ఇక్కడ లోన్ ఆఫర్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయాలి. ఇక్కడ ప్రీ-అప్రూవ్డ్ లోన్ ఆఫర్ కనిపిస్తుంది. మీరు తీసుకోవాలనుకుంటున్న ఆఫర్‌ను ఎంచుకోండి. ఇక్కడ లోన్ మొత్తం, వ్యవధిని ఎంచుకోండి. మీరు EMI ఎంపికను చూస్తారు. ఇక్కడ బ్యాంకు ఫీజులు, ఛార్జీలు కూడా చూపిస్తాయి. మీ సమాచారాన్ని తనిఖీ చేయడానికి రివ్యూపై క్లిక్ చేయండి. అన్నీ సరిగ్గా ఉంటే, ‘కొనసాగించు’పై క్లిక్ చేయండి. ‘అంగీకరించి వర్తించు’పై క్లిక్ చేసిన తర్వాత మీకు OTP వస్తుంది. OTPని నమోదు చేసి, సమర్పించుపై క్లిక్ చేయండి. మీరు లోన్ యొక్క నిర్ధారణను పొందుతారు, దాని గురించి మీరు ‘యువర్ లోన్’ ట్యాబ్‌లో చూడవచ్చు.

Paytm లోన్

UPI వాలెట్ Paytm త్వరిత వ్యక్తిగత రుణాన్ని అందిస్తుంది. Paytm పర్సనల్ లోన్ చిహ్నంపై క్లిక్ చేయడం ద్వారా మీరు దీని కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. Paytmలో మీరు రూ. 10,000 నుండి రూ. 2 లక్షల వరకు లోన్ తీసుకోవచ్చు. ఇందులో, మీరు KYC మరియు ఉద్యోగం లేదా ఉపాధి సమాచారాన్ని ఇవ్వాలి. లోన్ పొందడానికి బ్యాంక్ ఖాతా వివరాలు, EMI రీపేమెంట్ సెటప్ ఎంచుకోవాలి. లోన్ కోసం దరఖాస్తు చేస్తున్నప్పుడు, మీరు వడ్డీ, EMI గురించి సమాచారాన్ని పొందుతారు. దీని కోసం మీరు ప్రాసెసింగ్ ఫీజుతో పాటు జీఎస్టీ చెల్లించాలి. PAN సమాచారం వంటి KYC డేటా సెంట్రల్ KYC రిజిస్ట్రీ నుండి సేకరిస్తారు.

Thanks for reading Instant Loan: You can take a loan from Google Pay, Phone Pay, Paytm apps ..!

No comments:

Post a Comment